Allu Arjun: అల్లు అర్జున్ మైనం విగ్రహం ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
- By Sailaja Reddy Published Date - 09:15 AM, Fri - 22 March 24

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అంతేకాకుండా పుష్ప సినిమాకు గాను ఉత్తమ నా నటుడిగా కూడా అవార్డుని అందుకున్నారు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసే గౌరవాన్ని దక్కించుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ మైనపు విగ్రహం కోసం అల్లు అర్జున్ కొలతలు కూడా గత ఏడాది అక్టోబర్ లో తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి బన్నీ అభిమానులంతా ఆ విగ్రహం ఓపెనింగ్ ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆ విగ్రహం ఓపెనింగ్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారు.
ఇక ఈ ఓపెనింగ్ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహా ఆవిష్కరణ జరగబోతోంది. ఈ న్యూస్ ని దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయగా.. అల్లు అర్జున్ ఆ పోస్టుని రీ షేర్ చేస్తూ తన అభిమానులకు తెలియజేశారు. అయితే అభిమానుల్లో ఈ విగ్రహం ఎలా ఉండబోతుందని ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టి పుష్ప గెటప్ లో ఉండబోతుందా అని అందరూ అంచనాలు వేస్తున్నారు. అయితే అక్కడ విగ్రహం పుష్ప అండ్ అల వైకుంఠపురములో మూవీ పాత్రలను మిక్స్ చేస్తూ ఉండబోతుందట. పుష్ప మ్యానరిజం తగ్గేదేలే స్టైల్ తో అలా వైకుంఠపురములో చిత్రంలో రెడ్ జాకెట్‌తో ఉన్న అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ప్రదర్శితం కానుంది. కాగా ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ రెండు మైనపు బొమ్మలు లండన్ లోని మ్యూజియంలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ది దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న మొదటి ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ కావడం విశేషం.