HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Allu Arjun Was Found Like This

Pushpa 2 Premiere Show : అల్లు అర్జున్ ఇలా దొరికిపోయాడేంటి..?

Pushpa 2 Premiere Show : అల్లు అర్జున్ సినిమాలో జాతర సీను వరకు థియేటర్ లోనే కూర్చున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో జాతర సీన్ దాదాపు రెండు గంటలు తర్వాత వస్తుంది. అయితే రెండు గంటల పాటు అల్లు అర్జున్ థియేటర్ లోనే ఉన్నాడనేది వీడియో లో స్పష్టంగా తెలుస్తుంది

  • By Sudheer Published Date - 10:01 PM, Sat - 21 December 24
  • daily-hunt
Alluarjun Words
Alluarjun Words

తనపై జరుగుతున్న ప్రచారం , ఆభియోగాలపై అల్లు అర్జున్ (Allu Arjun) మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. తాను సినిమా థియేటర్ కు వెళ్లిన కాసేపటికే బయటకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. అయితే తాను చెప్పిందాంట్లో ఏమాత్రం నిజం లేదని సోషల్ మీడియా లో వీడియోలే చెపుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో జాతర సీను వరకు థియేటర్ లోనే కూర్చున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో జాతర సీన్ దాదాపు రెండు గంటలు తర్వాత వస్తుంది. అయితే రెండు గంటల పాటు అల్లు అర్జున్ థియేటర్ లోనే ఉన్నాడనేది వీడియో లో స్పష్టంగా తెలుస్తుంది. దానిని కూడా అల్లు అర్జున్ చెప్పకుండా సినిమా మొదలైన కాసేపటికే వెళ్లిపోయాను అని చెప్పడం అబద్ధమని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమని మరోసారి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇక అల్లు అర్జున్ మీడియా (Allu Arjun Media) సమావేశంలో ఏ మాట్లాడాడంటే ..

తనపై వస్తున్న అభియోగాలపై అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని ,బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ తెలుపుతూ.. ఘటనలో ఎవరి తప్పూ లేదని ప్రెస్ మీట్లో వివరించారు. ముందుగా రేవతి గారి కుటుంబానికి సారీ..నేను కావాలని చేసింది కాదు. తనపై జరుగుతున్న ప్రచారం తన క్యారెక్టర్‌పై దాడి చేయడమేనని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. నేను రోడ్ షో చేసానని, అనుమతి లేకుండా థియేటర్ కు వచ్చానని , థియేటర్ లో ఉన్న తనవద్దకు పోలీసులు వచ్చి వెళ్ళమని చెప్పారని ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అబద్దం. కావాలనే తనపై చేస్తున్న దుష్ప్రచారం. ఇలా అసత్యప్రచారం చేయడం వల్ల చాల బాధేస్తుంది. నేను సినిమా చేసి అది చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ ఘటన వల్ల నా సెలబ్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని చాల బాధపడుతున్న. అసలు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.. నా సినిమా థియేటర్‌లో ఎలా ఉందో కూడా చూడలేకపోయాను.

నా మీద అసత్య ఆరోపణలు చేస్తే ఎంత బాధగా ఉంటుంది. దురదృష్టకరం ఇది.. నాకు ఒక రెస్పాన్సిబులిటీ ఉంటుంది. నా 3 ఏళ్ల కష్టాన్ని థియేటర్లో చూడాలని అనుకున్నాను. నేను 20, 30 ఏళ్లుగా అదే థియేటర్‌కి వెళ్తున్నా. ఎప్పుడూ ఏం ఇలాంటివి జరగలేదు. నేను వెళ్లేటప్పటికీ పోలీసులే అవన్నీ క్లియర్ చేసారు. పర్మిషన్ ఉంది కాబట్టే నేను థియేటర్ లోకి వెళ్ళాను. రోడ్ షో చేసినట్లు చెపుతున్నారు అది తప్పు. థియేటర్ అక్కడ ఉంది.. కారు వెళ్తూ ఆగిపోయింది. నేను కనబడితే కానీ వాళ్లు వెళ్లరు.. నేనే కాదు ఎవరైనా అదే చేస్తారు. వాళ్లకి తృప్తి కలిగితేనే వాళ్లు కదులుతారు. అంతమంది నా కోసం వస్తే నేను ఎందుకు అగౌరంవాగా చేస్తా. నేను వాళ్లని వెళ్లమనే చెప్పా, థియేటర్‌కి వెళ్లిన తర్వాత.. నా వరకూ ఎవ్వరూ రాలేదు. ఏ పోలీసు నాకు ఏం చెప్పలేదు. నా మేనేజ్‌మెంట్ మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉంది. త్వరగా వెళ్ళండి అని చెపితే నా ఫ్యామిలీ ని అక్కడే ఉంచేసి వెళ్ళిపోయా. ఆ తర్వాతి రోజు నాకు తెలిసింది.. ఇలా ఒక లేడీ చనిపోయింది అని తెలిసి షాకయ్యా.. తర్వాతి రోజు వరకూ నాకు తెలీదు. అసలు థియేటర్‌లో ఉన్నప్పుడు ఇది జరిగిందని తెలిసినా నేనున్నాను అనడం అసత్య ఆరోపణ. నేను వెంటనే బన్నీ వాసుకి ఫోన్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని కలవమని చెప్పాను.. వాసు నేను వస్తానంటే మీరు రావద్దు అన్నాడు. ప్రాబ్లమ్ అవుతుందని చెపితే ఆగాను. తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్లు నా మీద కేసు పెట్టారు.అని తెలియగానే కలవకూడదని చెప్పి ఆపేసారు.

ఎవరో వైజాగ్‌లో చనిపోతేనో.. చిరంజీవి గారి ఫ్యాన్స్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్.. ఎవరో చనిపోతేనే నేను వైజాగ్, విజయవాడ వెళ్లినవాడిని, నా ఓన్ ఫ్యాన్స్ నా థియేటర్‌లో చనిపోతే కలవాలని నాకు ఉండదా..? లీగల్‌గా నన్ను కట్టేశారు. నేను స్పందించలేదని చెప్పడమేంటి..? అందుకే నెక్ట్స్ వీడియో పెట్టా.. డబ్బు కోసం కాదు మేటర్.. మేమ అన్ని సెలబ్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేశాం. డాడీ మీరు వెళ్లి కలవండి అని చెప్పా, స్పెషల్ పర్మిషన్ తీసుకోమని వెళ్లమని చెప్పను. నేను ఎన్ని అయినా తీసుకోగలను. తట్టుకోగలను.. కానీ ఇలాంటి లో పాయింట్‌లో ఇలాంటి ఆరోపణలు చేస్తే తట్టుకోలేను. నేను , సుకుమార్ , మైత్రి నిర్మాతలు ఇలా అందరం ఆ ఫ్యామిలీకి ఓ మంచి అమౌంట్ ఇద్దామని అనుకున్నాం. నాకు కూడా అదే వయసు కొడుకు ఉన్నాడు కదా.. నేను కూడా నాన్ననే కదా..అంటూ అల్లు అర్జున్ వివరించారు.

ఓవరాల్ గా బన్నీ చెప్పింది చూస్తే..తన పై వస్తున్న ఆరోపణల్లో , జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు.కోర్ట్ నిబంధనలు అనుసరించి కలవలేక పోతున్న తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఇది కావాలని చేసిన ప్రమాదం కాదు. అనుకోకుండా జరిగింది. దీనికి ఎవ్వరు బాద్యులు కాదు. నా తరుపున , చిత్ర యూనిట్ తరుపున ఆ కుటుంబానికి అండగా ఉంటాం. తనపై వస్తున్న ఆరోపణలు ఎవ్వరు నమ్మవద్దు అని చెప్పుకొచ్చారు.

Cinema start aina kasepu ki Vella antunnadu allu arjun
2 hr tarwata vache jathara scene Dhaka hall lone unadu 😚
Fake matalu anni 🙏#AlluArjun #Pushpa2#RevanthReddypic.twitter.com/CQXSzJMNX8

— JD (@alwaysmb123) December 21, 2024


Read Also : Minister Komati Reddy : శ్రీ తేజ్ తండ్రికి 25 లక్షల చెక్ ను అందించిన మంత్రి కోమటిరెడ్డి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Arrest
  • Allu arjun press meet
  • CM Revanth Reddy
  • Pushpa 2 Premiere Show

Related News

Pushpa 3

Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Pushpa 3 : అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప 3' చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తానని ఆయన కచ్చితంగా చెప్పారు. సుకుమార్ ఈ ప్రకటన చేయగానే వేదికపై మరియు సోషల్ మీడియాలో అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Siima 2025

    SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • CM Revanth Reddy offers special prayers to Khairatabad Bada Ganesh

    Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd