Minister Komati Reddy : శ్రీ తేజ్ తండ్రికి 25 లక్షల చెక్ ను అందించిన మంత్రి కోమటిరెడ్డి
Minister Komati Reddy : శ్రీ తేజను మంత్రి పరామర్శించి , అతడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వైద్యులతో మాట్లాడి..చికిత్స వివరాలు, ప్రస్తుతం బాబు పరిస్థితి ఎలా ఉంది..? మొదట్లో ఎలా ఉండేది..? ఇంకేమైనా చేస్తే త్వరగా రికవర్ అవుతాడా ..? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.
- By Sudheer Published Date - 08:00 PM, Sat - 21 December 24

పుష్ప 2 (Pushpa 2)సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల చెక్కు (Rs.25 లక్ష Check ) ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) రేవతి భర్త(Husband of Revathi)కు అందించారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుమారుడు శ్రీ తేజను మంత్రి పరామర్శించి , అతడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వైద్యులతో మాట్లాడి..చికిత్స వివరాలు, ప్రస్తుతం బాబు పరిస్థితి ఎలా ఉంది..? మొదట్లో ఎలా ఉండేది..? ఇంకేమైనా చేస్తే త్వరగా రికవర్ అవుతాడా ..? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.
శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని వారి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..పుష్ప 2 సినిమా ను తాను కూడా చూశానని, ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమాను తప్ప తెలుగు సినిమాలు చూడనని, పుష్ప 2 వల్ల మూడు గంటల సమయం వృధా అయ్యిందని, ఆ సమయంలో చాల పనులు చేసుకోవచ్చని ఆయన అన్నారు. సినిమాలతో యువత చెడిపోతుందని, సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లకూడదని, షోలు చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగారాదని, ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా చూడాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని, అందరూ హీరోలు, దర్శక, నిర్మాతలు సహకరించాలని కోమటిరెడ్డి కోరారు. అలాగే ఇకపై ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద బడ్జెట్‌తో తీసినా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం, టిక్కెట్ల ధరలు కూడా పెంచే ఛాన్స్ ఉండదని తేల్చి చెప్పారు.
Read Also : Star Health : “స్టార్ ఆరోగ్య డిజి సేవ”ను ఆవిష్కరించిన స్టార్ హెల్త్