Hopefully soon: బన్నీకి బాలీవుడ్ ఆఫర్.. బట్ కండిషన్స్ అప్లయ్!
పుష్ప మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. "పుష్ప: ది రైజ్" డిసెంబర్ 17 న విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా
- By Balu J Published Date - 12:28 PM, Mon - 3 January 22

పుష్ప మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17 న విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. అయితే తనకు బాలీవుడ్ సినిమాల్లో నటించే ఆలోచన ఉన్నట్లు, తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ‘‘నాకు ఆఫర్ వచ్చింది. కానీ ఆనందించతగ్గ విషయమేమీ కాదు. బాలీవుడ్ లోకి ఎంట్రీ త్వరలో ఉంటుందని ఆశిస్తున్నా’’ అని అన్నాడు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ఆర్య, దేశముదురు, పరుగు, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ సినిమాల్లో నటించాడు. టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఆకట్టుకుంటున్న బన్నీ తాను హిందీ స్క్రీప్ట్ ను వినప్పుడు, మరొక నటుడితో (రెండో క్యారెక్టర్) స్ర్కీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పాడు. మనం చేసే సినిమాలకి మనం కథానాయకులమైనప్పుడు, మన దగ్గరకు వచ్చే ఎవరైనా ఆ ప్రపోజల్ తో మాత్రమే వస్తారు. పెద్ద స్టార్‌ని సెకండ్ రోల్ చేయమని అడగడం సమంజసం కాదు. సినిమా బాగా రావచ్చు, రాకపోవచ్చు కూడా. అది వాళ్లకు కూడా తెలుసు. నేను కథానాయకుడిగా, మెయిన్ లీడ్‌గా పని చేయాలి’’ అంటూ రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.
“పుష్ప: ది రైజ్” దాని హిందీ-డబ్బింగ్ వెర్షన్ నుండి రూ. 56.69 కోట్లు వసూలు చేసిన అద్భుతమైన రన్‌తో సంతోషంగా ఉన్నాడు.“ఆర్య” ఫేమ్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. కాగా అల్లు అర్జున్ యాక్షన్-డ్రామా అలా వైకుంఠపురములో హిందీలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో షెహజాదాగా రీమేక్ అవుతోంది.