Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ మూవీతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అయాన్!
- By Sailaja Reddy Published Date - 11:00 AM, Mon - 26 February 24

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా బన్నీ పుష్ప సినిమాకు గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కి ఒక పాప ఒక బాబు ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.
పాప పేరు అల్లు అర్హ, బాబు అల్లు అయాన్. వీరిద్దరిలో అల్లు అర్హ కాస్త యాక్టీవ్ గా ఉండడంతో పాటు చలాకీ గా ఉంటూ తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కాగా అర్హ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంతతో కలిసి శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యిందీ స్టార్ కిడ్. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ తనయుడు కూడా సినిమా రంగంలోకి రావడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. అది కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ తో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుష్ప 2 లో నటిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది..
కొద్ది రోజుల క్రితం బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నటుడు అల్లు అర్జున్ పుష్ప 3 గురించి మాట్లాడారు. అయితే అక్కడి వారు అల్లు అయాన్ గురించి అడిగితే మోడల్ బోల్తే అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. కాబట్టి పుష్ప 2 లేదా పుష్ప 3 సినిమాలో అల్లు అయాన్ ఉంటాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే అల్లు అయాన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.