Pushpa2 Video: లారీల ఛేజింగ్ సీన్స్.. పుష్ప2 లీక్ వీడియో వైరల్!
పుష్ప 2కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- By Balu J Published Date - 02:53 PM, Sat - 17 June 23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను రంపచోడవరం రిజర్వ్ ఫారెస్ట్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2లో ఇప్పటికే ఎక్కువ మంది విలన్లు ఉన్నారు. పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఫహద్ ఫాజిల్ కూడా నెగిటివ్ పాత్రలో కనిపించనున్నాడు. పుష్ప 2లో అతని పాత్ర కీలకం కానుంది. అలాగే జగపతి బాబు మరో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని సంప్రదిస్తున్నారట.
పుష్ప 2 సినిమాకు సంబంధించిన కొన్ని షూటింగ్ సన్నివేశాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్రచందనం దుంగలను లారీలతో నదిలో తీసుకెళ్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఎవరో వంతెనపై నిలబడి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూటింగ్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తూ వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్ర య త్నిస్తోంది. అయితే పుష్ప 2 సినిమాను మాత్రం ఈ లీకులు వెంటాడుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం కావడం. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా కావడంతో పుష్ప 2కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో హక్కులను టీ-సిరీస్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది.
https://twitter.com/TeluguScribe/status/1669963505821442048?cxt=HHwWgIDThb6986wuAAAA
Also Read: KCR Survey: కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ రెడీ, సిట్టింగ్స్ లో టెన్సన్!