Pushpa 2 : అల్లు అర్జున్.. నంద్యాలలో ప్రీరిలీజ్ పెట్టండి – ఎంపీ రిక్వెస్ట్
Pushpa 2 : 'మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అదే తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి నంద్యాలలో ప్లాన్ చేయండి. మీరు నంద్యాలకు రావడమనే సెంటిమెంట్ మాకు బాగా పనిచేసింది.
- Author : Sudheer
Date : 01-12-2024 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) మేనియా నడుస్తుంది. సుకుమార్ – అల్లు అర్జున్ (Sukumar – ALlu Arjun) కలయికలో తెరకెక్కిన పుష్ప 2 ను చూసెయ్యాలనే ఆత్రుత విడుదల సమయం దగ్గర పడుతున్నకొద్దీ పెరిగిపోతుంది. తాజాగా బుక్ మై షో లో టికెట్స్ ఆలా ఓపెన్ అయ్యాయో లేదో..నాల్గు రోజుల టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అన్ని చోట్ల టికెట్ ధరలు భారీగా పెంచిన అభిమానం ముందు అవన్నీ తక్కువే అయ్యాయి. టికెట్ దొరికిన వారు సంతోషంగా ఉంటె టికెట్స్ దొరకని వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె పుష్ప 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 2న జరగనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్కు హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ మేరకు ‘హైదరాబాద్లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే..అల్లు అర్జున్ పై ఎంపీ బైరెడ్డి శబరి (MP Byreddy Sabari) ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అదే తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి నంద్యాలలో ప్లాన్ చేయండి. మీరు నంద్యాలకు రావడమనే సెంటిమెంట్ మాకు బాగా పనిచేసింది. మీ పుష్ప-2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నంద్యాల రాక తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం పోలీసు కేసు, న్యాయస్థానాల్లో పిటిషన్ల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో, టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Read Also : Solar Eclipse 2025 : 2025లో ఏర్పడబోయే సూర్యగ్రహణాల గురించి తెలుసా ?