Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్..మెగా ఫ్యాన్స్ సంబరాలు..?
Allu Arjun Arrest : నేషనల్ స్టార్ ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంత ఆరా తీస్తున్నారు. కొంతమంది అరెస్ట్ చేయడాన్ని సమర్దిస్తుండగా..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 01:57 PM, Fri - 13 December 24

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. నేషనల్ స్టార్ ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంత ఆరా తీస్తున్నారు. కొంతమంది అరెస్ట్ చేయడాన్ని సమర్దిస్తుండగా..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణంగా గతకొద్ది రోజులుగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరే.
ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ అభిమానులు మరియు మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. గతంలో అల్లు అర్జున్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ ల పేర్లు చెప్పుకొని తన సినిమాలను ప్రమోషన్ చేసుకునేవాడు..కానీ పుష్ప హిట్ తర్వాత అల్లు అర్జున్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన ఎదుగుదలకు తన స్వయం కృషే కారణమని , తన వెనుక ఎవరు లేరని చెప్పడం..అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్ధికి అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపాయి. ఈ కారణాలే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ ను వారంతా సంతోషానికి గురి చేస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ను (Allu Arjun) పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి (osmania hospital ) తరలించారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఉస్మానియా ఆస్పత్రిలో అల్లు అర్జున్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీక్షించి, తగిన నివేదిక సిద్ధం చేయనున్నారు. అరెస్టు సమయంలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించడం న్యాయపరమైన విధిగా ఉండటంతో, ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆస్పత్రికి చేరుకున్న సమాచారం తెలియగానే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ హీరోకు న్యాయం చేయాలని అభిమానులు ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారు. ఈ అరెస్టు, వైద్య పరీక్షలు, కోర్టు విచారణ వంటి పరిణామాలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి తన వాదనను కోర్టులో ఎలా చెప్పుకుంటారు..? జడ్జ్ ఏ విధంగా స్పందిస్తారు..? ఒకవేళ రిమాండ్ కు తరలిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉందా..? అనేది ఆసక్తి రేపుతోంది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ ..జైలు లో వేసే ఛాన్స్ ఉందా..?