AAA Cinemas : అల్లు అర్జున్ థియేటర్ ప్రభాస్ సినిమాతో ఓపెనింగ్.. AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ ఆ రోజే..
ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి అల్లు అర్జున్ AAA సినిమాస్ ని నిర్మించారు.
- Author : News Desk
Date : 11-06-2023 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
మన సినిమా హీరోలంతా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారు. ఇటీవల పలువురు హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్స్(Multiplex Theaters) కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నిర్మాతలతో పాటు మహేష్ బాబు(Mahesh Babu), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. పలువురు హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్స్ నడిపిస్తున్నారు. అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టారు.
ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి అల్లు అర్జున్ AAA సినిమాస్ ని నిర్మించారు. హైదరాబాద్ అమీర్‌పేట్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న స్థలంలో భారీ మాల్ కట్టి అందులో AAA మల్టీప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. ఇందులో 5 స్క్రీన్స్ ఉండనున్నాయి. ఇవన్నీ డాల్బీ సౌండ్ సిస్టమ్ తో డిజైన్ చేశారు.
ఈ AAA సినిమాస్ జూన్ 15న అల్లు అర్జున్, తెలంగాణ సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక ఇందులో జూన్ 16న రిలీజయ్యే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో సినిమా రిలీజ్ తో మొదలవ్వనున్నాయి. దీంతో అల్లు అర్జున్ థియేటర్ ప్రభాస్ సినిమాతో ఓపెనింగ్ కానుంది. మంచి సెంటర్ లో ఉండటం, ఆ ఏరియాలో ఎక్కువగా స్టూడెంట్ ఉండటంతో AAA సినిమాస్ బాగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.