Alia Bhatt: ఆస్పత్రిలో అలియా భట్.. తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ!
ఆలియా భట్-రణ్ బీర్ కపూర్లు వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 12:39 PM, Sun - 6 November 22
ఆలియా భట్-రణ్ బీర్ కపూర్లు వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఈ జంట ఒక్కటైయారు. అంతేకాదు పెళ్లైనా ఇక రెండు నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పింది ఆలియా. తన ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ రాకుండా కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాలు చేస్తోందని తెలుస్తోంది ఆలియా. ఆలియా భట్..హలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి షూటింగ్ ఈ మధ్యే పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ను పోర్చుగల్‌లోని ఎడారిలో పూర్తి చేశారట.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రబృందానికి థాంక్స్ చెబుతూ ఆలియా ఆ ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడోట్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. ఇటీవల బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్లో కూడా ఆలియా తన భర్తతో కలిసి పాల్గొంది. బేబీ బంప్‌తో తిరుగుతూ హల్ చల్ చేసింది. అయితే తాజాగా ఆలియా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆలియా భర్తతో కలిసి డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఆలియా, రణ్‌బీర్ కపూర్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వీరిద్దరు మరికొన్ని గంటల్లో తమ బిడ్డకు ఈ లోకంలో వెల్కమ్ చెబుతారని సమాచారం.
Related News
Pratibha Patil Hospitalised : హాస్పటల్ లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్..
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురికావడం తో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నా�