Pooja Hegde : బుట్ట బొమ్మ అల విహార యాత్రలో..!
- By Ramesh Published Date - 04:51 PM, Thu - 29 August 24

బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) సినిమాల పరంగా ఆడియన్స్ కు దూరంగా ఉన్నా అమ్మడి సోషల్ మీడియా అప్డేట్స్ తో మాత్రం ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పూజా హెగ్దే ఇన్ స్టాగ్రాం లో ఒక్క ఫోటో పెడితే చాలు అలా లక్షల కొద్దీ లైక్స్ వచ్చి పడతాయి. ఈమధ్య ఫోటోషూట్ విషయంలో కూడా కాస్త వెనకపడ్డ అమ్మడు జాలీ ట్రిప్ లో బిజీ బిజీగా ఉంది. తెలుగులో ఎలాంటి ఛాన్సులు లేకపోయినా ఇప్పటికీ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది పూజా హెగ్దే.
మహేష్ (Mahesh Babu) గుంటూరు కారం సినిమా నుంచి బయటకు వెళ్లిన తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు. నాగ చైతన్య నెక్స్ట్ సినిమా లో నటిస్తుందన్న వార్తలు రాగా వాటిని ఇంకా కన్ ఫర్మ్ చేస్తూ అనౌన్స్ మెంట్ రాలేదు. ఐతే ఈలోగా తనకు నచ్చిన ప్రదేశాన్ని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంది పూజా హెగ్దే. ప్రస్తుతం అమ్మడు కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
సినిమాల పరంగా అమ్మడు వెనకబడి ఉన్నా దానికి ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వక అలా ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. ఐతే పూజా హెగ్దే కాస్త గ్యాప్ ఇచ్చి సినిమాలు చేసినా ఆమెను సపోర్ట్ చేసేందుకు ఫ్యాన్స్ ఎప్పుడు సిద్ధమే అంటున్నారు. అమ్మడు కూడా వారి కోసమే నేనున్నా అంటూ అడపాదడపా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.
ఏది ఏమైనా పూజా హెగ్దే మళ్లీ వరుస సినిమాలు చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరిస్తారన్నది చూడాలి.