Akhil : అఖిల్ బర్త్ డే రోజు అప్డేట్ ఇస్తారా..?
Akhil అక్కినేని నట వారసుడు అఖిల్ లాస్ట్ ఇయర్ ఏజెంట్ సినిమాతో వచ్చాడు. అతను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కెరీర్ లో ఐదు సినిమాలు చేస్తే
- Author : Ramesh
Date : 31-03-2024 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
Akhil అక్కినేని నట వారసుడు అఖిల్ లాస్ట్ ఇయర్ ఏజెంట్ సినిమాతో వచ్చాడు. అతను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కెరీర్ లో ఐదు సినిమాలు చేస్తే బ్యాచిలర్ సినిమా ఒక్కటే సోసోగా ఆడింది. ఏజెంట్ తర్వాత అఖిల్ చేసే సినిమా ఏంటన్నది ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. హోంబలె ప్రొడక్షన్స్ లో ధీర అనే సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ వాటిల్లో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.
అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఉన్నారు. అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ తన బర్త్ డే రోజు వస్తుందేమో అని అనుకుంటున్నారు. అఖిల్ బర్త్ డే ఏప్రిల్ 8న ఉందిల్. సో ఆరోజు అఖిల్ ఆరో సినిమా అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని ఆడియన్స్ అనుకుంటున్నారు. హోంబలె ప్రొడక్షన్స్ లో పీరియాడికల్ మూవీగా అఖిల్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఆ సినిమాకు సంబందించిన అప్డేట్ ఏప్రిల్ 8న వస్తే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతారన్ చెప్పొచ్చు. సినిమా సినిమాకు అఖిల్ తీసుకుంటున్న గ్యాప్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నా అఖిల్ సినిమా ఏదై ఉంటుందా అన్న ఆలోచనతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Ravi Antony : టిల్లు పంచుల వెనుక ఉన్న రైటర్ అతనేనా..?