Ajay with Ajay Devagan : అజయ్ వర్సెస్ అజయ్.. సిగం అగైన్ తో అక్కడ ఎంట్రీ..!
Ajay with Ajay Devagan తెలుగు సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడంతో అక్కడ సినిమాలకు ఇక్కడ.. మన సినిమాలకు అక్కడ ఒక రేంజ్ లో అంచనాలు
- Author : Ramesh
Date : 20-05-2024 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
Ajay with Ajay Devagan తెలుగు సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడంతో అక్కడ సినిమాలకు ఇక్కడ.. మన సినిమాలకు అక్కడ ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ ఇయర్ రాబోతున్న సినిమాలన్ని మీద పాన్ ఇండియా వైడ్ గా ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇదిలాఉంటే తెలుగు యాక్టర్స్ కు వరుసగా బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా మన తెలుగు నటుడు అజయ్ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తెలుగులో విలన్ గా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్న అజయ్ కి అజయ్ దేవగన్ సినిమాలో ఆఫర్ వచ్చింది.
తెలుగులో సైడ్ రోల్స్ నుంచి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారాడు అజయ్. పాన్ ఇండియా సినిమాల్లో కూడా అతను నటిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ అందుకున్నాడు. అజయ్ దేవగన్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ సింగం సీరీస్ లో త్వరలో రాబోతున్న సింగం అగైన్ లో ఛాన్స్ అందుకున్నాడు అజయ్.

అజయ్ దేవగన్ తో పాటు సెట్ లో అజయ్ పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అజయ్ విత్ అజయ్ అంటూ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజయ్ దేవగన్ సిగం అగైన్ తో మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అసలైతే ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా పుష్ప 2 వస్తుండడంతో వాయిదా వేస్తారని అంటున్నారు.
Also Read : Mega Fans Unsubscribing Aha : ఆహా అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..?