Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా.. ఎక్కడో తెలుసా?
త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్రయూనిట్.
- By News Desk Published Date - 08:30 PM, Wed - 24 May 23

ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతిసనన్(Krithi Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రామాయణం(Ramayanam) ఆధారంగా భారీగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. మొదట సినిమా టీజర్ రిలీజ్ తర్వాత విమర్శలు వచ్చినా అనంతరం ట్రైలర్, సాంగ్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ చేయబోతున్నారు.
ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్రయూనిట్.
🔔 Get ready for a cinematic pilgrimage like no other ⏰ ✨
Mark your calendars for June 6th as #Adipurush descends upon the sacred grounds of Tirupati for an epic Pre-Release Event! 🔥
Prepare for an unforgettable journey into the realm of pure cinematic wonder 🔥 🎬… pic.twitter.com/PJ8zaHoubx
— UV Creations (@UV_Creations) May 24, 2023
జూన్ 6న తిరుపతి SV గ్రౌండ్స్ లో అత్యంత భారీగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా పలు రాష్ట్రాల్లో నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ యూనిట్ తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కూడా చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తిరుపతి ఈవెంట్ కు హాజరవ్వనున్నారు. గతంలో ప్రభాస్ బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా తిరుపతిలోనే నిర్వహించడం విశేషం.
Also Read : Tiger Nageswara Rao : రవితేజ ఊర మాస్.. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్..
Related News

Adipurush Second Song: నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో!
కొద్దిసేపటి క్రితమే ఆదిపురుష్ మేకర్స్ రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. రాముడి, సీత మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని తెలియజేస్తుంది.