Adah Sharma : బార్ డాన్సర్ గా మారిన టాప్ హీరోయిన్.. పేరు కూడా రోజీగా మార్చేసుకుంది..!
Adah Sharma కేరళ స్టోరీ తో సూపర్ పాపులర్ అయిన అదా శర్మ ఆ సినిమా తర్వాత కమాండో సినిమాతో కూడా సత్తా చాటింది. ఇక ఈ మూవీ తర్వాత సన్ ఫ్లవర్ వెబ్ సీరీస్ తో వస్తుంది అదా శర్మ.
- By Ramesh Published Date - 10:36 PM, Sun - 4 February 24

Adah Sharma కేరళ స్టోరీ తో సూపర్ పాపులర్ అయిన అదా శర్మ ఆ సినిమా తర్వాత కమాండో సినిమాతో కూడా సత్తా చాటింది. ఇక ఈ మూవీ తర్వాత సన్ ఫ్లవర్ వెబ్ సీరీస్ తో వస్తుంది అదా శర్మ. వికాస్ బాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సన్ ఫ్లవర్ వెబ్ సీరీస్ జీ 5 లో రిలీజై మంచి సక్సెస్ అయ్యింది. ఈ సీరీస్ సెకండ్ సీజన్ త్వరలో రాబోతుంది. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ లో అదా శర్మ నటిస్తుంది.
సీరీస్ లో రోజీ పాత్రలో అదా శర్మ నటించబోతుంది. ఇందులో ఆమె బార్ డ్యాన్సర్ గా కనిపించనుంది. క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే అదా శర్మ తన మార్క్ పర్ఫార్మెన్స్ తో అలరిస్తుంది. కేరళ స్టోరీ తర్వాత ఆమె గురిచి అంతటా క్రేజీ డిస్కషన్స్ జరిగాయి.
ఇప్పుడు సన్ ఫ్లవర్ సీజన్ 2 తో మరో పాత్రతో సర్ ప్రైజ్ చేయనుంది. సినిమాలు సీరీస్ లు ఏదైనా సరే తన వరకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది అదా శర్మ. మరి ఈ సీరీస్ లో బార్ డ్యాన్సర్ రోజీ పాత్రలో అదా శర్మ ఎలా నటిస్తుందో చూడాలి.
Also Read : Nakkina Trinatha Rao : ధమాకా డైరెక్టర్ నిర్మాతలకు కొత్త దంకీ.. ఈ ట్విస్ట్ ఎవరు ఊహించలేదుగా..!