Shraddha Arya : తల్లి కాబోతున్న హీరోయిన్.. ప్రగ్నెన్సీ గురించి పోస్ట్..
తాజాగా శ్రద్ధ ఆర్య తాను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించింది.
- By News Desk Published Date - 02:41 PM, Mon - 16 September 24

Shraddha Arya : తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఢిల్లీ భామ శ్రద్ధ ఆర్య ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం శ్రద్ధ ఆర్య బాలీవుడ్ లో సినిమాలు, టీవీ షోలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. 2021లో శ్రద్ధ ఆర్య ఇండియన్ నేవి ఆఫీసర్ అయిన రాహుల్ నగల్ ని పెళ్లి చేసుకుంది. రెగ్యులర్ గా తన భర్తతో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది శ్రద్ధ ఆర్య.
తాజాగా శ్రద్ధ ఆర్య తాను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించింది. తన భర్తతో కలిసి చేసిన ఓ స్పెషల్ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలోనే తాను ప్రగ్నెంట్ అని చెప్పేలా చూపించింది. ఆ వీడియోని షేర్ చేస్తూ ఓ చిన్ని అద్భుతం మా జీవితంలోకి రానుంది అని పోస్ట్ చేసింది. దీంతో ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.
Also Read : Siddharth – Aditi Rao Hydari : ఒక్కటైన సిద్దార్థ్ – అదితి రావు హైదరి.. గుళ్లో వివాహం..