HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Radhika Apte Sensetional Comments On Tollywood Industry

Radhika Apte: టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.. వాళ్లదే ఆదిపత్యం అంటూ?

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2024 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 17 Feb 2024 09 49 Am 6739
Mixcollage 17 Feb 2024 09 49 Am 6739

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలలో నటించిన రాధిక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూ అక్కడే సెటిల్ అయింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత లెజెండ్, లయన్ సినిమాల్లో నటించి అలరించింది. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.

అయితే నిత్యం ఈ బ్యూటీ ఏదొక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు లేకపోలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లేని పోనీ కాంట్రవర్సీలను తెచ్చుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆమె తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక మాట్లాడుతూ..

నేను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ తెలుగు. ఎందుకంటే ఆ పరిశ్రమ చాలా పితృస్వామికమైనది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పురుషాధిక్యత ఎక్కువగా ఉంది. పురుషులు గుడ్డి జాతీయవాదులు. అక్కడ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అసహనంగా ఉంది. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. సెట్ లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. అక్కడ నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను. ఏం చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు షూట్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడ నా అవసరం కొంతవరకే అని గ్రహించాను అని చెప్పుకొచ్చింది రాధిక. కాగా ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ప్రస్తుతం రాధిక పై టాలీవుడ్ ప్రేక్షకులు మండి పడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • radhika apte
  • sensational comments
  • tollywood

Related News

Pooja Hegde Makes Shocking Comments About Movies

Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే థియేట్రికల్ సినిమా ప్రస్తుత పరిస్థితిపై చేసిన కొన్ని ముక్కుసూటి వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎంతగానో అప్‌డేట్ అయ్యారని, సినిమా ఎంపికలో ఎంతో నిశితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా చూసేటప్పుడు అది నిజంగా ఎంటర్‌టైన్ చ

  • Kangana's Request: Actress Girija Oak Declines the 'National Crush' Tag

    Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Delhi Fire Accident: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd