HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Jacqueline Fernandez Offers To Turn Approver

Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-04-2026 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar
Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించింది.

నిబంధనల ప్రకారం జాక్వెలిన్ అప్రూవర్‌గా మారాలనుకుంటే మొదట దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, దానిని పరిశీలించిన తర్వాతే ఆమెను అప్రూవర్‌గా మార్చాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ దాఖలు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే జాక్వెలిన్ అప్రూవర్‌గా మారే అవకాశం ఉంటుంది.

గతేడాది సెప్టెంబర్‌లో తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె అప్రూవర్‌గా మారేందుకు ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుకేశ్ నేర చరిత్ర గురించి తనకు తెలియదని, తానూ అతని చేతిలో మోసపోయానని జాక్వెలిన్ మొదటి నుంచి వాదిస్తున్నారు. సుకేశ్ తనను తాను ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని తప్పుదోవ పట్టించాడని ఆమె కోర్టులో పేర్కొన్నారు.

అయితే, ఈడీ మాత్రం జాక్వెలిన్‌ను ఈ కేసులో సహ నిందితురాలిగా పేర్కొంటూ 2022 ఆగస్టులోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుకేశ్ ఒక నేరస్థుడని తెలిసి కూడా అతని నుంచి రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు, కార్లు, ఖరీదైన వస్తువులను బహుమతులుగా స్వీకరించారని ఈడీ ఆరోపిస్తోంది. సుకేశ్ అరెస్ట్ అయిన తర్వాత జాక్వెలిన్ తన ఫోన్‌లోని డేటాను తొలగించారని, మొదట్లో ఆర్థిక లావాదేవీల వివరాలను దాచిపెట్టి, ఆధారాలు చూపించాక అంగీకరించారని దర్యాప్తు సంస్థ తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది.

ప్రస్తుతం పలు కేసుల్లో సుకేశ్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. అతను జాక్వెలిన్‌ను తన ప్రేయసిగా చెప్పుకుంటూ జైలు నుంచి ప్రత్యేక సందర్భాల్లో లేఖలు రాయడం తెలిసిందే. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ, జాక్వెలిన్ మాత్రం తాను మోసపోయినట్లు చెబుతున్నారు. తాజా పరిణామంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actress Jacqueline Fernandez
  • bollywood actress
  • crime news
  • delhi court
  • ED Investigation
  • enforcement directorate
  • Jacqueline Fernandez
  • Jacqueline Fernandez news
  • money laundering case
  • sukesh chandrasekhar
  • Sukesh Chandrasekhar case

Related News

Did Sia get married before the plot to murder Ketan was hatched? A 'secret marriage'—shocking details revealed in WhatsApp chats; police disclose the information.

Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

లోనావాలా సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోట నుండి వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి; ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ హత్య కేసులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది: కేతన్ కాబోయే భార్య (ఫియాన్సీ) మరియు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు అప్పటికే వివాహం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం కేస

  • Sexual assault on one's own mother

    Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd