Aamir Khan : రాజమౌళి కంటే ముందే ఆమిర్ ఖాన్ మహాభారతం.. ఆల్రెడీ రైటింగ్ మొదలుపెట్టిన ఆమిర్ ఖాన్..
ఆల్రెడీ బాలీవుడ్ లో రణబీర్, సాయి పల్లవితో రామాయణం తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మహాభారతం కూడా తెరకెక్కించబోతున్నారు.
- By News Desk Published Date - 10:29 AM, Tue - 22 April 25

Aamir Khan : మన భారతదేశ చరిత్ర రామాయణం, మహాభారతం గురించి ఎన్నిసార్లు చెప్పినా తనివితీరదు. ఇప్పటికే ఈ రెండిటిని ఆధారంగా తీసుకొని అన్ని భాషల్లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇప్పటికి కూడా ఇంకా సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్ లో రణబీర్, సాయి పల్లవితో రామాయణం తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మహాభారతం కూడా తెరకెక్కించబోతున్నారు.
రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని, ఎప్పటికైనా దాన్ని తీస్తానని, కొన్ని భాగాలుగా ఆ సినిమాని తీస్తానని గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి కంటే ముందు ఆమిర్ ఖాన్ మహాభారతం తీస్తారని తెలుస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహాభారతం పై తాను సినిమా తీస్తున్నాను అని దాని గురించి తెలిపాడు.
ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. మహాభారతాన్ని ఈ జనరేషన్ కి అందించాలి. ఈ ఏడాదే దాని పనులు మొదలుపెడతాను. ఆల్రెడీ రైటింగ్ మొదలుపెట్టాను. పూర్తి స్క్రిప్ట్ కి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. మహాభారతాన్ని ఒక సినిమాలాగా చూపించలేం. కొన్ని సిరీస్ లుగా తీసుకు రావాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఇందులో పనిచేయనున్నారు. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఏ పాత్రకు ఎవరు సరిపోతారో అప్పుడు నటీనటుల గురించి ఆలోచిస్తాను. నేను నటిస్తానా లేదా అనేది స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. ఈ విషయంలో బాద్యతతో పాటు భయం కూడా ఉంటుంది. ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో మహాభారతాన్ని తీయాలి. ఈ ప్రాజెక్టుతో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్నాను అని తెలిపారు.
ఇక ఈ సినిమాని దాదాపు 1000 కోట్లతో భారీగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఆమిర్ ఖాన్ మహాభారతం ప్రాజెక్టు గురించి మాట్లాడి త్వరలోనే మొదలుపెడతాను అని చెప్పడంతో ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి డ్రీం కంటే ముందే ఆమిర్ ఖాన్ మహాభారతం తీసేస్తాడా? ఆమిర్ ఖాన్ మహాభారతం మొదలుపెడితే రాజమౌళి ఆపేస్తాడా లేక ఈ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆమిర్ ఖాన్ రాజమౌళికి ఇస్తాడా తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే.
Also Read : Janhvi Kapoor : ముంబై రోడ్ల మీద జాన్వీకి స్కూటీ నేర్పిస్తున్న హీరో.. ఫోటోలు వైరల్..