Janhvi Kapoor : ముంబై రోడ్ల మీద జాన్వీకి స్కూటీ నేర్పిస్తున్న హీరో.. ఫోటోలు వైరల్..
జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా ముంబై రోడ్ల మీద స్కూటీ నడుపుతున్నారు.
- By News Desk Published Date - 10:12 AM, Tue - 22 April 25

Janhvi Kapoor : శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. దేవరతో టాలీవుడ్ ని మెప్పించిన జాన్వీ త్వరలో బాలీవుడ్ లో పరమ్ సుందరి అనే సినిమాతో రాబోతుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. పరమ్ సుందరి సినిమా జులై 25న రిలీజ్ కాబోతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా ముంబై రోడ్ల మీద స్కూటీ నడుపుతున్నారు. జాన్వీ కపూర్ కి స్కూటీ డ్రైవింగ్ రాకపోవడంతో హీరో సిద్దార్థ్ వెనక కూర్చొని జాన్వికి నేర్పిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ముంబై రోడ్లపై ఈ హీరో – హీరోయిన్ చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాన్వీ కపూర్ సిద్దార్థ్ మల్హోత్రా డ్రైవింగ్ నేర్పిస్తున్న ఈ ఫోటోలు షేర్ చేసి.. అతన్ని రైడ్ కి తీసుకెళ్లడం పరమ్ కి ఇష్టం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తుంది. అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కూడా జాన్వీనే తీసుకుంటారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Mahesh Babu : మొత్తం 5.9 కోట్లు.. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..