Aamir Khan : చెన్నైకి మకాం మార్చేస్తున్న ఆమీర్.. ఎందుకంటే..?
Aamir Khan బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రస్తుతం ముంబై లో నివసిస్తున్న విషయం తెలిసిందే సినిమాల పరంగా అంత ఫాం లో లేని ఆమీర్ ఖాన్
- Author : Ramesh
Date : 21-10-2023 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
Aamir Khan బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రస్తుతం ముంబై లో నివసిస్తున్న విషయం తెలిసిందే సినిమాల పరంగా అంత ఫాం లో లేని ఆమీర్ ఖాన్ అతను నటించిన చివరి సినిమా లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అవడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే ఈమధ్య నిర్మాతగా మరో ప్రయత్నం చేయాలని చూస్తున్నాడు ఆమీర్ ఖాన్.
ఇదిలాఉంటే ముంబై వదిలి చెన్నై (Chennai)కి ఆమీర్ తన మకాం మార్చాలని అనుకుంటున్నాడట. అయితే అది పూర్తిగా కాదు కేవలం ఒక రెండు నెలలు చెన్నైలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఆమీర్ ఖాన్ తల్లి ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తల్లి ఆరోగ్యం దృష్ట్యా రెండు నెలలు ఆమె దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణంగా చెన్నైలో ఒక రెండు నెలలు ఉండాలని ఫిక్స్ అయ్యారట.
హాస్పిటల్ కి దగ్గర్లోనే ఒక హోటల్ లో రెండు నెలలు ఆమీర్ చెన్నైలో ఉంటారని తెలుస్తుంది. ఈమధ్య సౌత్ డైరెక్టర్స్ సత్తా చాటుతున్న టైం లో ఆమీర్ ఖాన్ కూడా సౌత్ దర్శకుల మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో ప్రయోగాలు చేస్తూ సత్తా చాటిన ఆమీర్ ఖాన్ (Aamir Khan) ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస దగ్గర బోల్తా కొడుతున్నాయి. అందుకే సౌత్ డైరెక్టర్స్ తో ఆమీర్ ఖాన్ ఓ భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : Nandu Geetha Madhuri Divorce గీతా మాధురితో డైవర్స్.. నందు ఇలా షాక్ ఇచ్చాడేంటి..?