Nandu Geetha Madhuri Divorce గీతా మాధురితో డైవర్స్.. నందు ఇలా షాక్ ఇచ్చాడేంటి..?
Nandu Geetha Madhuri Divorce సింగర్ గీతా మాధురి యాక్టర్ నందు ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇద్దరికి ఒక పాప కూడా ఉంది.
- Author : Ramesh
Date : 21-10-2023 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
Nandu Geetha Madhuri Divorce సింగర్ గీతా మాధురి యాక్టర్ నందు ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఈమధ్య సెలబ్రిటీల మధ్య మనస్పర్ధలు రావడం విడాకులు తీసుకోవడం కామన్ అయ్యాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు రావడం సడెన్ గా సెలబ్రిటీస్ సైలెంట్ గా వారి సోషల్ మీడియాలో డైవర్స్ తీసుకుంటున్నాం అంటూ అనౌన్స్ చేయడం జరుగుతుంది.
కొన్నాళ్లుగా నందు (Nandu) గీతా మాధురి గురించి కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. నటుడిగా నందు కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా లేదు. సింగర్ గా గీతా మధురి తన పంథా కొనసాగిస్తుంది. అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇద్దరు విడాకులు తీసుకుంటారని ఫిల్మ్ నగర్ లో టాక్.
Also Read : Man Crueal Attack on Dog కుక్క మొరిగిందని పక్కింటి వ్యక్తి క్రూరత్వం.. ప్రైవేట్ పార్ట్ లో రాడ్డుతో..!
రీసెంట్ గా ఈ వార్తలపై స్పందించాడు నందు. లేటెస్ట్ గా ఓంకార్ డైరెక్షన్ లో మాన్షన్ 24 (Mansion 24) వెబ్ సీరీస్ లో నందు నటించాడు. ఈ వెబ్ సీరీస్ (Web Series) ప్రమోషన్స్ లో నందు గీతా మాధురి (Geetha Madhuri) తో తను విడిపోతున్నా అంటూ వచ్చిన వార్తలపై స్పందించాడు. గీతా మాధురితో తను డైవర్స్ తీసుకుంటున్నా అని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇలాంటి న్యూస్ లను విని తామిద్దరం నవ్వుకుంటామని అన్నాడు నందు.
సోలో హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు అయితే వచ్చిన చిన్న చిన్న అవకాశాలను కూడా చేస్తూ వస్తున్నాడు నందు. మాన్షన్ 24 వెబ్ సీరీస్ లో నందు పాత్ర మెప్పించింది.