National Awards 2024 : 70వ నేషనల్ అవార్డుల లిస్ట్ ఇదే..
భారత ప్రభుత్వం 70వ నేషనల్ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారంలో మన తెలుగు సినిమా కూడా అవార్డుని అందుకుంది. ఆ అవార్డుల లిస్ట్ వైపు ఓ లుక్ వేసేయండి.
- By News Desk Published Date - 02:24 PM, Fri - 16 August 24

National Awards 2024 : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం.. భారత ప్రభుత్వం ప్రకటించే ‘జాతీయ చలనచిత్ర అవార్డులు’. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ 70వ నేషనల్ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారంలో మన తెలుగు సినిమా కూడా అవార్డుని అందుకుంది. 2022 సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఆ అవార్డుల లిస్ట్ వైపు ఓ లుక్ వేసేయండి.
బెస్ట్ డైరెక్టర్ – సూరజ్ భర్జత్యా (ఊంచాయ్)
బెస్ట్ ఫీచర్ ఫిలిం – అట్టం (మలయాళం)
బెస్ట్ ఫిలిం (హోల్‌సమ్ ఎంటర్టైనర్) – కాంతార
బెస్ట్ విఎఫెక్స్ – బ్రహ్మాస్త్ర
బెస్ట్ యాక్టర్ – రిషబ్ శెట్టి (కాంతార)
బెస్ట్ యాక్ట్రెస్ – నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం), మాన్సి పారేఖ్ (కుచ్ ఎక్స్‌ప్రెస్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – నీనా గుప్త (ఊంచాయ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)
బెస్ట్ ప్లే బ్యాక్ మేల్ సింగర్ – అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర)
బెస్ట్ ప్లే బ్యాక్ ఫీమేల్ సింగర్ – బాంబే జయశ్రీ
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – ఏ ఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
బెస్ట్ సౌండ్ డిజైన్ – కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ 2)
బెస్ట్ హిందీ ఫిలిం – గుల్మొహర్
బెస్ట్ కన్నడ ఫిలిం – కేజీఎఫ్ 2
బెస్ట్ తెలుగు ఫిలిం – కార్తికేయ 2
బెస్ట్ తమిళ్ ఫిలిం – పొన్నియిన్ సెల్వన్ 2
బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ – కేజీఎఫ్ 2
స్పెషల్ మెన్షన్ అవార్డు (యాక్టర్) – మనోజ్ బాజ్పాయ్ (గుల్మొహర్)
స్పెషల్ మెన్షన్ అవార్డు (మ్యూజిక్ డైరెక్టర్) – సంజయ్ సలీల్ చౌదరి
బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ – జానకి మాస్టర్, సతీష్ కృష్ణన్(తిరు చిత్రంబలం)(మేఘం కరుకత సాంగ్)
బెస్ట్ లిరిక్స్ – నౌషాద్ సదర్(ఫౌజా)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – అపరాజితో
బెస్ట్ ఎడిటింగ్ – ఆట్టం
బెస్ట్ స్క్రీన్ ప్లే – ఆట్టం
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – శ్రీపత్ (మళ్లికాపురం)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవి వర్మ (పొన్నియన్ సెల్వన్ -1)
ఈసారి అత్యధికంగా 6 అవార్డులు తమిళ చిత్రాలకే వచ్చాయి. పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలకు నాలుగు అవార్డులు, తిరు చిత్రంబలం చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. ఆ తరువాత మలయాళ మూవీ ఆట్టంకు మూడు అవార్డులు, అత్యధికంగా పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలకు నాలుగు అవార్డులు రాగా, మలయాళం ఆట్టం సినిమాకు మూడు అవార్డులు, కన్నడ చిత్రాలు కేజిఎఫ్ 2 అండ్ కాంతార సినిమాలకు చెరో 2 అవార్డులు, తమిళ్ తిరు చిత్రంబలం సినిమాకు 2 అవార్డులు వచ్చాయి.