Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర కోసం అన్ని సెట్లు వేస్తున్నారా..?
Megastar Chiranjeevi Viswambhara సినిమా కోసం 17 సెట్లు దాకా వేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో
- Author : Ramesh
Date : 29-04-2024 - 10:35 IST
Published By : Hashtagu Telugu Desk
Megastar Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేం వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాకు 200 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారని టాక్.
ఇదిలాఉంటే ఈ సినిమా లో భారీ రేంజ్ లో సెట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా కోసం 17 సెట్లు దాకా వేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో 9 సెట్లు వేయగా మరో 8 సెట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ.ఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలోనే ఈ సెట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది.
వశిష్ట ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి భోళాశంకర్ తో బోల్తా కొట్టాడు. విశ్వంభర తో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు చిరు.
కొన్నాళ్లుగా చిరంజీవి రొటీన్ రెగ్యులర్ సినిమాలే చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకుని మరీ ఈ టైం లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు చిరంజీవి. వశిష్ట చెప్పిన కథ నచ్చడంతో విశ్వంభర సినిమా మరో జగదేకవీరుడు అతిలోక సుందరి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.