8th Pay Commission: బడ్జెట్‌లో 8వ వేతన సంఘం గురించి ఎందుకు ప్రకటించలేదు?
8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 06:04 PM, Sat - 1 February 25

8th Pay Commission: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2025న కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పించారు. ఇది ఆయన వరుసగా ఎనిమిదో బడ్జెట్ మరియు మూడవసారి మోడీ ప్రభుత్వంలో రెండవ బడ్జెట్. ఈ బడ్జెట్‌తో, కేంద్ర బడ్జెట్‌ను వరుసగా 8 సార్లు సమర్పించిన దేశానికి మొదటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. అయితే బడ్జెట్‌లో 8వ వేతన కమిషన్‌కు (8th Pay Commission) సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. దాని గురించి తెలుసుకుందాం.
8వ వేతన సంఘంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి?
2025 బడ్జెట్‌కు ముందు 8వ పే కమిషన్‌కు సంబంధించి ప్రభుత్వం పెద్ద ప్రకటన చేయవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల నిర్మాణంలో సవరణలకు సంబంధించి కొన్ని కొత్త ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్‌లో అలాంటి ప్రకటనేమీ చేయలేదు. దీని 8వ వేతన సంఘం కింద ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం రూ.51,000 వరకు ఉంటుంది.
Also Read: Budget 2025: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. అలాంటప్పుడు రూ.8-12 లక్షలపై 10% ఎందుకు?
మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఏం చెప్పారు?
ఈ విషయంపైమాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఇటీవల మాట్లాడుతూ.. పే కమిషన్ ఏర్పాటు గురించి సాధారణంగా బడ్జెట్‌లో ప్రకటించరు. కేంద్రం బడ్జెట్‌లో పే కమిషన్ ఏర్పాటును ప్రకటించరని ఆయన స్పష్టం చేశారు. కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఇప్పటికే ధృవీకరించారు. అయితే దీని అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.
వచ్చే 1-2 నెలల్లో ప్రభుత్వం అధికారికంగా పే కమిషన్‌ను ప్రకటించవచ్చని గార్గ్ తెలిపారు. కమిషన్ ఏర్పాటుకు అవసరమైన అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఇందులో కమిషన్ సభ్యుల ఎంపిక, ఆమోద ప్రక్రియ, టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ తయారీ వంటి అంశాలు కూడా ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఈ ప్రక్రియలన్నీ బడ్జెట్‌లో భాగం కావని తెలిపారు.
8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన నివేదికల ప్రకారం.. ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లో కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుండి తదుపరి అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి ఉండవలసి ఉంటుంది.