HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Wedding Season Effect Gold And Silver Prices Increase Drastically

పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 21-02-2026 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

Gold Price  పసిడి ప్రియులకు అలర్ట్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. అయితే, వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, భారీ సుంకాల ప్రకటనలు బంగారం ధరలు మళ్లీ పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.

దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇలాంటి సందర్భంలో సాధారణంగానే బంగారానికి గిరాకీ పెరుగుతుంది. జువెలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే, ఇదే సమయంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతుండడం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం వరకు వరుసగా తగ్గుతూ వచ్చి ఊరట కల్పించిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్ పై అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించదన్నన వార్తలకు తోడు మళ్లీ పలు దేశాలపై సుంకాల ప్రకటనలు చేయడం బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. పసిడిపై భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి, వెండి రేట్లు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ 5 వేల డాలర్ల పైకి చేరాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 128 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ పసిడి ధర 5106 డాలర్లకు పైగా పలుకుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 8.92 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ఇవాళ 84.59 డాలర్లు పలుకుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు క్రితం రోజు తులానికి రూ.2290 మేర పెరగగా ఈరోజు మరో రూ.880 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,57,370 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు నిన్నటి రోజున తులానికి రూ.2100 మేర పెరగగా ఇవాళ మరో రూ.800 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,250 వద్దకు ఎగబాకింది.

స్థిరంగా వెండి రేటు

బంగారం ధర వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నా వెండి మాత్రం స్వల్ప ఊరట కల్పించింది. క్రితం రోజు రూ.10 వేల మేర పెరిగిన వెండి ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ. 2,70,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఫిబ్రవరి 21వ తేదీ శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో మధ్యాహ్నానికి ధరలు మారిపోతుంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా ఉండే బంగారం రేట్లు తెలుసుకోవడం మంచిది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24K gold price
  • gold price
  • gold price down
  • silver price
  • Silver Price Drop

Related News

Great news for gold lovers... Gold prices have dropped significantly.

Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగగా, ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు. అయితే మళ్లీ మధ్యలో యుద్ధం ముగుస్తుందన్న అంచనాలతో క్రూడాయిల్ ధరలు తగ్గగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు చూస్తే మళ్లీ భారీగా దిగొచ్చింది. గత 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగగా, ఇప్పుడు జూన్ 23న తగ్గుముఖం పట్టి

  • Gold prices have risen; here is the current rate following today's hike.

    Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Gold prices drop—a great opportunity for buyers.

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

Latest News

  • Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

  • Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Tirumala School: తిరుమల స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd