HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >This Is Called Kubers Treasure The Stock Price Increased Lakhs Of Times In One Day

Stock Price Increased: జాక్ పాట్ అంటే ఇదే.. రూ. 10 వేలు పెట్టుబడి పెడితే రూ. 67 కోట్లు సొంతం అయ్యేవి!

మంగళవారం, మే 6, 2025 నాటికి మార్కెట్ మూసివేసే సమయానికి షేరు ధర 1,31,200 రూపాయలుగా ఉంది. ఈ షేరులో ఈ రోజు 1.23 శాతం క్షీణత నమోదైంది.

  • By Gopichand Published Date - 09:49 PM, Tue - 6 May 25
  • daily-hunt
Stock Price Increased
Stock Price Increased

Stock Price Increased: స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టే చాలా మంది వ్యక్తుల కల ఏమిటంటే.. రాత్రికి రాత్రి వారిని కోటీశ్వరులుగా మార్చే స్టాక్‌ను కనుగొనడం. ఈ రోజు మేము మీకు అలాంటి స్టాక్ (Stock Price Increased) గురించి చెప్పబోతున్నాం. ఇది నిజంగా ఒక్క రాత్రిలో దాని పెట్టుబడిదారులను కోట్లలో కోట్లు సంపాదించే వారిగా మార్చింది. అలాగే ఈ స్టాక్ ప్రస్తుత ధర ఏమిటి?దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం.

మ‌నం మాట్లాడుతున్న షేరు పేరు ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్. 2024 సంవత్సరం చివరిలో ఈ షేరు గురించి ఎంత చర్చ జరిగిందంటే.. మరే షేరు గురించి అంతగా జరగలేదు. నిజానికి 2024 అక్టోబర్ 28 వరకు ఈ కంపెనీ షేరు ధర 3 రూపాయల 53 పైసలుగా ఉంది. కానీ అక్టోబర్ 29న మార్కెట్ తెరిచిన వెంటనే ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేరు ధర అకస్మాత్తుగా 2 లక్షల 36 వేల రూపాయలకు చేరుకుంది. అంటే ఒక్క రోజులో షేరు ధర 66,92,535 శాతం పెరిగింది.

Also Read: Deputy CM Bhatti: సౌర పంపు సెట్లను భారీగా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన భ‌ట్టి

అకస్మాత్తుగా ధర ఎందుకు ఇంతగా పెరిగింది?

నిజానికి ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కేటగిరీ కింద నమోదైన ఒక NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ). దీనికి సొంతంగా ఎలాంటి వ్యాపారం లేదు. కానీ కంపెనీ ఆసియన్ పెయింట్స్ వంటి పలు పెద్ద కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. అందుకే అక్టోబర్ 29న స్టాక్ ధరను నిర్ణయించడానికి ఒక ప్రత్యేక కాల్ వేలం నిర్వహించబడింది. ఆ రోజే ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు అకస్మాత్తుగా 2,36,250 రూపాయల ధరకు చేరుకున్నాయి.

ఈ రోజు ఈ షేరు ధర ఎంత?

మంగళవారం, మే 6, 2025 నాటికి మార్కెట్ మూసివేసే సమయానికి షేరు ధర 1,31,200 రూపాయలుగా ఉంది. ఈ షేరులో ఈ రోజు 1.23 శాతం క్షీణత నమోదైంది. గత 6 నెలల గురించి మాట్లాడితే.. ఈ షేరులో 56 శాతానికి పైగా క్షీణత ఉంది.

షేరు ఫండమెంటల్స్

షేరు ఫండమెంటల్స్ గురించి మాట్లాడితే.. దీని ప్రస్తుత మార్కెట్ క్యాప్ 2624 కోట్ల రూపాయలు. స్టాక్ P/E రేషియో 13.9గా ఉంది. ROCE (రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్) 2.02 శాతం, ROE (రిటర్న్ ఆన్ ఈక్విటీ) 1.53 శాతంగా ఉంది. షేరు ఫేస్ వాల్యూ 10 రూపాయలు. దీని ఆల్-టైమ్ హై 3,32,400 రూపాయలు.

గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు షేరు ఫండమెంటల్స్, మార్కెట్ ట్రెండ్స్, రిస్క్‌లను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Elcid Investment
  • Multibagger Stocks
  • Stock Price
  • Stock Price Increased

Related News

Layoffs

Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

ఎవరైనా తమ ఉద్యోగం కోల్పోబోతున్నప్పుడు వారికి అనేక రకాల సంకేతాలు (Hints) లభిస్తాయి. అయితే మీకు ఇలా జరుగుతున్నంత మాత్రాన మీ ఉద్యోగం ప్రమాదంలో ఉందని చెప్పలేము.

  • Gold Prices

    Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

Latest News

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

  • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

  • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

  • Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd