HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >These Are Todays Gold Prices Youll Be Surprised To Know A Lot

Gold Rate : నేటి బంగారం ధరలు ఇవే… ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…

ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

  • Author : Latha Suma Date : 19-07-2025 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
9 Carat Gold
9 Carat Gold

Gold Rate : జూలై 19వ తేదీ శనివారం నాడు (ఈరోజు) బంగారం ధరలు మరోసారి భారీ ఎత్తున పెరిగాయి. పసిడి ధర ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,280గా నమోదవ్వగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 91,500కి పెరిగింది. ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా అమెరికాలో బంగారం ధర ఒక్కడిగా పెరుగుతూ ప్రస్తుతం 1 ఔన్స్ ధర $3350కి చేరింది. ఇది ప్రపంచ రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: AP Liquor Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్..?

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి డాలర్ విలువ పడిపోవడమే. డాలర్ బలహీనత కారణంగా గోల్డ్‌కి డిమాండ్ గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఇటీవల నష్టాల్లో నడుస్తుండటంతో పెట్టుబడిదారులు పసిడిపై దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల బంగారంపై మరింతగా డిమాండ్ ఏర్పడి ధరలు పరుగులు పెట్టుతున్నాయి. ఇక, దేశీయ రిటైల్ మార్కెట్లలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో సాధారణ వినియోగదారులు పసిడి కొనుగోలుకు ముందుకు రావడంతో డిమాండ్ మరింతగా పెరుగుతోంది. కానీ ధరల పెరుగుదల వల్ల వారు ఎటూ తేలక, పసిడి కొనుగోలు విషయంలో జంకుతున్నారు. ఇప్పుడు ఆభరణాలు కొనాలంటే గతంతో పోలిస్తే సగటున 20-30 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.

వెండి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తొలిసారిగా వెండి ధర రూ. 1.25 లక్షలను దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే వెండి ధరలో 40 శాతం మేర పెరుగుదల నమోదైందని విశ్లేషకులు అంటున్నారు. వెండి కూడా పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగపడటం, పెట్టుబడి లక్ష్యంగా మారడం వంటి అంశాల వల్ల దీని డిమాండ్ పెరిగిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చే వారికి ఇది భారంగా మారుతోంది. ఒకరకంగా చెప్పాలంటే, ఇది సాధారణ మధ్య తరగతి ప్రజలకు ఒక పెద్ద ఆర్థిక భారం అవుతుంది. అయితే దీన్ని పెట్టుబడి అవకాశంగా భావిస్తున్న వారు మాత్రం మరింతగా కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయ మార్పులు లేకపోతే, బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వినియోగదారులు ఆచితూచి ముందడుగు వేయడం ఉత్తమమని నిపుణుల సూచన.

Read Also: Protein Deficiency : రోజంతా అలసటగా అనిపిస్తుందా?.. అయితే ప్రోటీన్ లోపం వల్ల కలిగే ఇతర లక్షణాలు, సమస్యలు ఏంటో తెలుసుకుందాం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dollar value
  • gold rate
  • gold rate today
  • International market
  • silver rate

Related News

Gold- Silver Rate Today

Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

చైనీస్ కొత్త సంవత్సరం సెలవుల కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువగా ఉంది. దీనివల్ల చిన్న మార్పులు కూడా ధరల్లో పెద్ద హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.

  • Gold Rate

    బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • Gold Price

    పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

Latest News

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd