Kumar Mangalam Birla : కుమార్ మంగళం బిర్లా చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
‘‘ప్రతీ సమావేశాన్ని, అక్కడ జరిగే నిర్ణయాలను సునిశితంగా పరిశీలించాలని మా నాన్న(Kumar Mangalam Birla) చెప్పేవారు. నిశితంగా పరిశీలిస్తే .. మనం చాలా విషయాలను అర్థం చేసుకోవచ్చు.’’
- By Pasha Published Date - 10:27 PM, Sun - 13 April 25

Kumar Mangalam Birla : బిర్లా.. ఈ రెండక్షరాల పదమే పెద్ద బ్రాండ్. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచే బిర్లా గ్రూపు వివిధ రకాల వ్యాపారాలను చేస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు వ్యాపార విలువ ప్రస్తుతం రూ.5.55 లక్షల కోట్లు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం నడుపుతున్న దిగ్గజం పేరు కుమార్ మంగళం బిర్లా. ఎంతో ఖ్యాతి గడించిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఛాన్సలర్ కూడా ఈయనే. దాదాపు 40 దేశాల్లో బిర్లా గ్రూపునకు వ్యాపారాలు ఉన్నాయి. కుమార్ మంగళం బిర్లా సక్సెస్ సీక్రెట్స్‌ను మనం తెలుసుకుందాం..
Also Read :Actor Vijay : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకు హీరో విజయ్
కుమార్ మంగళం బిర్లా ఏం చెప్పారంటే..
- ‘‘ప్రతీ సమావేశాన్ని, అక్కడ జరిగే నిర్ణయాలను సునిశితంగా పరిశీలించాలని మా నాన్న(Kumar Mangalam Birla) చెప్పేవారు. నిశితంగా పరిశీలిస్తే .. మనం చాలా విషయాలను అర్థం చేసుకోవచ్చు.’’
- ‘‘ఇతరుల నిర్ణయం తెలుసుకున్నాకే.. అవకాశాలు ఇవ్వాలి. భయపెట్టి.. అవకాశాలు ఇవ్వకూడదు. భయపెట్టి.. పనులు చేయించకూడదు. మా నాన్న మాత్రం నా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. బలవంతంగా నాతో సీఏ చేయించారు.’’
- ‘‘ప్రతీ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు నేను పని గురించి అస్సలు ఆలోచించను. ఫ్యామిలీకే ఆ టైమంతా ఇస్తా. మా నాన్న మరణం తర్వాతే నేను మారిపోయా. ఇలా ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను.’’
- ‘‘రిస్క్ తీసుకునే వాళ్లకే ఫెయిల్యూర్స్ వస్తాయి. వాటికి భయపడొద్దు. ఓడిపోయి.. ఆ తర్వాత గెలిస్తే ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. మనపై మనకు గౌరవం కూడా పెరుగుతుంది.’’
Also Read :Man Vs Dogs : పోయే కాలం.. కుక్కలపై యువకుడి అత్యాచారాలు
- ‘‘మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే మనసుకు నచ్చిన పని చేయాలి.’’
- ‘‘ఎదిగిన కొద్దీ ఒదగడం అనేది నేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని చూసి నేర్చుకున్నాను.తక్కువ మాట్లాడి ఎక్కువగా వినడం ఆయన గొప్పతనం.’’
- ‘‘కోపంతో ఏమీ సాధించలేం. నాకు కోపం వస్తే డైరీలో రాసుకుంటాను. అప్పుడప్పుడూ వాటిని చదువుతాను. కోపం కంట్రోల్‌పై వ్యాసాలు చదువుతుంటా.’’