HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Actor Politician Joseph Vijay Moves Supreme Court Against Waqf Act

Actor Vijay : వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకు హీరో విజయ్

‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు పలువురు సుప్రీంకోర్టులో(Actor Vijay) పిటిషన్లు వేశారు. 

  • By Pasha Published Date - 09:45 PM, Sun - 13 April 25
  • daily-hunt
Actor Politician Joseph Vijay Supreme Court Waqf Act Tvk Party Tamil Nadu

Actor Vijay : ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ అధినేత, హీరో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే భారత పార్లమెంటు ఆమోదించిన ‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ముస్లిం వర్గంతో ముడిపడిన ‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’కు సంబంధించిన న్యాయపోరాటానికి విజయ్ తెరతీయడం గమనార్హం. తమిళనాడు రాష్ట్ర జనాభాలో 87.6 శాతం మంది హిందువులు, 6.12 శాతం మంది క్రైస్తవులు, 5.86 శాతం మంది ముస్లింలు ఉన్నారు.

Also Read :Man Vs Dogs : పోయే కాలం.. కుక్కలపై యువకుడి అత్యాచారాలు

కేంద్ర ప్రభుత్వం కేవియట్.. 

‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు పలువురు సుప్రీంకోర్టులో(Actor Vijay) పిటిషన్లు వేశారు.  ఈ పిటిషన్లపై ఏప్రిల్‌ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 పిటిషన్లు దాఖలవగా, మరికొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట లిస్ట్‌ కావాల్సి ఉంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌ ఉన్నారు. ఈ పిటిషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత మంగళవారమే సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేసింది.  తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలను జారీ చేయొద్దని సుప్రీంకోర్టు బెంచ్‌ను కేంద్ర సర్కారు కోరింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’ కొన్ని రోజుల క్రితమే అమల్లోకి వచ్చింది.

Also Read :Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్‌.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ

వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు

వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 19న హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ నెల 23న చలో హైదరాబాద్‌లో పాల్గొనాలని ముస్లిం మతపెద్దలు పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలో విపక్ష పాలిత రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు ఎలాంటి మలుపును తీసుకుంటాయో వేచి చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Politician
  • actor vijay
  • Joseph Vijay
  • Supreme Court
  • tamil nadu
  • TVK Party
  • Waqf Act

Related News

Four years of locality mandatory for medical students: Supreme Court

Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.

  • E20 Fuel Policy

    E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అస‌లు ఈ20 ఇంధ‌నం అంటే ఏమిటి?

  • A Bihar-like situation should not happen here: Stalin appeals to party cadres

    Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు

Latest News

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd