HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Stop Buying Gold Pm Modis Appeal

Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

  • Author : Vamsi Chowdary Korata Date : 11-05-2026 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Urges No Gold Purchase
Modi Urges No Gold Purchase

ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ ప్రయాణాలకు ఏడాది కాలం దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే మెట్రో, ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టును మాత్రమే వాడాలని, సొంత వాహనాలను అనవసరంగా రోడ్డు మీదకు తేకూడదని అన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా జీవించడం కూడా ఒక రకమైన దేశ సేవే అని ఆయన పిలుపునిచ్చారు.

ఇరాన్ వివాదం కారణంగా హార్మూజ్ జలసంధి మార్గంలో రవాణా నిలిచిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం భారత్‌పై చూపే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజల కోసం ఆయన ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా బంగారం కొనవద్దని, విదేశీ ప్రయాణాలు చేయవద్దని, మెట్రోనే వాడాలని, ఇంటి దగ్గరే ఉండి పని చేయాలని సూచించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

మెట్రో రైళ్లు, బస్సుల్లోనే వెళ్లాలి..!

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని ప్రధాని సూచించారు. కార్ పూలింగ్ పద్ధతులను అనుసరించాలని, సాధ్యమైనంత వరకు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరారు. అలాగే వస్తు రవాణాకు రైల్వేలను ఉపయోగించడం వల్ల ఇంధన భారాన్ని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.

బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలకు స్వస్తి

విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ప్రస్తుత తరుణంలో అత్యంత ఆవశ్యకమని మోదీ అన్నారు. అందుకే కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు, విదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను వాయిదా వేసుకోవాలని కుటుంబాలను కోరారు. అదే విధంగా అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇది దిగుమతుల భారాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు.

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి పునరుద్ధరణ”

కరోనా సమయంలో మనం పాటించిన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్ వంటి పద్ధతులను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనివల్ల ఆఫీసులకు వెళ్లే ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా భారీగా ఇంధనం ఆదా అవుతుందని అన్నారు. ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌ల ద్వారా సమయం, వనరులను ఆదా చేయవచ్చని సూచించారు.

మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ఓటు..

విదేశీ వస్తువుల వ్యామోహాన్ని వీడి, భారత్‌లో తయారైన వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని కోరారు. మనం నిత్యం వాడే బూట్లు, బ్యాగులు, ఇతర ఉపకరణాలు స్వదేశీ కంపెనీలవే కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు బలపడతాయన్నారు. అంతర్జాతీయ పర్యాటకానికి బదులుగా స్వదేశీ పర్యాటక రంగానికి మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు.

కేవలం పట్టణ ప్రజలే కాకుండా రైతులు కూడా ఈ ఆర్థిక యుద్ధంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించి, డీజిల్ పంపుల స్థానంలో సోలార్ విద్యుత్ పంపులను వాడాలని సూచించారు. “ప్రస్తుత తరుణంలో దేశానికి మనం చేసే అతిపెద్ద సేవ ఆర్థిక క్రమశిక్షణే” అని ప్రధాని స్పష్టం చేశారు. అందరూ ఈ ఐదు సూత్రాలను పాటించి దేశం సంక్షోభంలో కూరుకుపోకుండా చూడాలని పునరుద్ఘాటించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 24 Carat Gold Rate
  • global crisis
  • Gold Purchases
  • pm modi

Related News

A treat for gold lovers... gold prices have crashed.

Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు ఇది నిజంగా పండగే. దేశీయ మార్కెట్లో జులై 11వ తేదీన బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,330 […]

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Latest News

  • Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

  • Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

  • Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!

  • AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

  • StepX Neo Smartphone: ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd