Passport Rule: పాస్‌పోర్ట్ విషయంలో భార్యాభర్తలకు కొత్త నియమం.. ఇకపై మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు!
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది.
- By Gopichand Published Date - 12:39 PM, Sat - 12 April 25

Passport Rule: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో (Passport Rule) భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది. ఈ కొత్త నియమం ప్రకారం ఇప్పుడు పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి ఒక అఫిడవిట్ సమర్పించాలి.
జాయింట్ ఫోటోతో అఫిడవిట్ సమర్పణ
ఈ నియమం ప్రకారం.. భర్త-భార్య ఇద్దరూ కలిసి ఒక జాయింట్ ఫోటోతో అఫిడవిట్ సమర్పించడం ద్వారా పేరును జోడించవచ్చు. అంటే పాస్‌పోర్ట్‌లో జీవిత భాగస్వామి పేరును జోడించడానికి ఇకపై వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదు. జాయింట్ ఫోటో, అఫిడవిట్ సమర్పిస్తే చాలు. దీనిపై భర్త-భార్య ఇద్దరి సంతకాలు ఉండాలి.
గతంలో పాస్‌పోర్ట్‌లో జీవిత భాగస్వామి పేరును జోడించడానికి సుదీర్ఘమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉండేది. వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగం కోసం లేదా ఇతర కారణాల వల్ల విదేశాలకు వెళ్లాల్సిన వారికి సమస్యలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు ఈ సమస్యలు ఉండవు.
అనెక్సర్-జే నియమం వివరాలు
విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం అనెక్సర్-జే నియమం అమలులోకి వచ్చింది. దీని కింద భర్త-భార్య ఇద్దరూ తమ వివాహ ఫోటో లేదా ఇటీవలి జాయింట్ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. అవసరమైన ఫారమ్‌ను పూరించాలి. దీనిపై ఇద్దరి జాయింట్ సంతకాలు ఉండాలి. అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఈ పత్రాలను వివాహ ధృవీకరణ పత్రంగా పరిగణించి, పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడిస్తారు.
Also Read: UPI: ఫోన్ పే, గూగుల్ పే నుంచి వేరొకరికి డబ్బు పంపించారా? అయితే టెన్షన్ వద్దు!
పాస్‌పోర్ట్ ఫీజు, ప్రక్రియ:
- ఫీజు: సాధారణ పాస్‌పోర్ట్ కోసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఫీజు చెల్లించాలి. తత్కాల పాస్‌పోర్ట్ కోసం అదనపు ఫీజు చెల్లించాలి.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. దీని కోసం https://portal2.passportindia.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
ప్రక్రియ
- న్యూ యూజర్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లండి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, Passport Seva వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకున్న నగరంలోని పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఎంచుకోండి.
- అవసరమైన వివరాలను పూరించి, Register బటన్‌పై క్లిక్ చేయండి.