HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Over 39000 Maruti Cars Recalled Free Replacement

Maruti Suzuki Recalls : 39 వేలకుపైగా మారుతీ కార్ల రికాల్.. ఫ్రీగా రీప్లేస్‌మెంట్!

  • By Vamsi Chowdary Korata Published Date - 05:04 PM, Sat - 15 November 25
  • daily-hunt
Grand Vitara
Grand Vitara

కార్ల తయారీ కంపెనీలు ఇటీవల పోటాపోటీగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. జీఎస్టీ రేట్ల కోత నేపథ్యంలో ఇటీవల సేల్స్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా మార్కెట్లోకి తెస్తున్న క్రమంలో ఏదో ఒక లోపం బయటపడుతోంది. ఇప్పుడు కొన్ని లోపాల నేపథ్యంలో.. మారుతీ సుజుకీ తన గ్రాండ్ విటారా మోడళ్లను 39 వేలకుపైగా రికాల్ చేసింది.

దిగ్గజ కార్ల తయారీ సంస్థ.. మారుతీ సుజుకీ సంచలన ప్రకటన చేసింది. తన సుమారు 39,506 గ్రాండ్ విటారా మోడళ్లను రికాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నట్లు అనుమానించిన కంపెనీ వాటిని వెనక్కి పిలిపిస్తోంది. ప్రధానంగా ఫ్యూయెల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్‌లో లోపం కారణంగానే రికాల్ ప్రకటన చేసినట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇవి 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన మోడళ్లుగా పేర్కొంది. ఈ మ్యాచ్ మారుతీ గ్రాండ్ విటారా మోడళ్లలోని కొన్ని వాహనాల్లో స్పీడో మీటర్ అసెంబ్లీలో .. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్స్ సరిగా పనిచేయట్లేదని గుర్తించినట్లు తెలిపింది కంపెనీ.

ఈ లోపాలతో ఫ్యూయెల్ స్టేటస్ సరిగా చూయించట్లేదని.. వినియోగదారుల నుంచి తమ దృష్టికి ఈ సమస్య వచ్చినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఈ లోపం ఉన్న మిడ్ SUV గ్రాండ్ విటారా కార్ల యజమానులకు వ్యక్తిగతంగానే మారుతీ సుజుకీ నుంచి సమాచారం అందుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా.. కార్లను తనిఖీ చేసి సమస్య ఉన్న లేదా పాడైన పార్టును ఉచితంగానే రీప్లేస్ చేయనున్నట్లు తెలిపింది.

ఇక్కడ ఫ్యూయెల్ స్టేటస్ అస్పష్టంగా చూయిస్తుండటం వల్ల అప్పుడు వాహనదారులు .. తమ కారులో ఇంధనం అయిపోయే ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయలేక ఇబ్బందులు ఎదుర్కోవచ్చని కంపెనీ భావించింది. ఈ క్రమంలోనే కస్టమర్ల భద్రత, వాహనం విశ్వసనీయత కోసం కంపెనీ ముందస్తుగా రికాల్ చేపట్టింది. ఇక్కడ అధీకృత డీలర్ వర్క్ షాప్స్ ద్వారా ఉచితంగానే పాడైపోయిన పార్టుల్ని రీప్లేస్ చేస్తారు. అందుకే.. కంపెనీ నుంచి సమాచారం అందిన వెంటనే.. కార్ల యజమానులు వేగంగా స్పందించి.. తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది.

గ్రాండ్ విటారా విషయానికి వస్తే.. 32 నెలల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 3 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల విషయానికి వస్తే.. వార్షిక ప్రాతిపదికన 2024-25లో 43 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక మారుతీ సుజుకీ అక్టోబర్ నెల మొత్తం విక్రయాల్ని పరిశీలిస్తే.. ఏకంగా 2.20 లక్షల వాహనాల్ని విక్రయించింది. ప్రధానంగా చిన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం, దీపావళి పండగ నేపథ్యంలో డిస్కౌంట్లు వంటి వాటి కారణంగా సేల్స్ పెరిగాయి. మారుతీ సుజుకీ గతంలో 2024లో ఇలాగే 16 వేల యూనిట్ల వరకు వ్యాగన్ ఆర్, బాలెనో మోడళ్లను రికాల్ చేసింది. అప్పుడు ఇంధన పంప్ మోటార్ లోపం కారణంగా వెనక్కి పిలిపించింది. వాహన భద్రతను నిర్ధరించేందుకు.. వాహన పరిశ్రమలో ఇది సాధారణంగానే జరిగే ప్రక్రియగా చెప్పొచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Grand Vitara
  • maruti suzuki
  • Recall Check

Related News

November Car Sales

November Car Sales: న‌వంబ‌ర్ నెల‌లో ఇన్ని కార్ల‌ను కొనేశారా?

హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో మొత్తం 66,840 కార్లను విక్రయించింది. ఇది ఏడాది వారీగా 9 శాతం వృద్ధిని సూచిస్తుంది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు 60,340 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతుల్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపించింది.

  • Maruti Suzuki

    Maruti Suzuki: మారుతి సుజుకి తీసుకురాబోయే కొత్త కార్ల లిస్ట్ ఇదే!

Latest News

  • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

  • Nail Rubbing: మీకు ఈ అలవాటు ఉందా? రోజుకు 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు!!

  • Putin Dinner: పుతిన్ విందుపై రాజకీయ దుమారం.. ఆ విష‌యంపై కాంగ్రెస్ అభ్యంతరం!

  • Putin Travel Cars: పుతిన్ ప్రయాణించిన కార్లు.. ఆరస్ సెనాట్- ఆర్మర్డ్ ఫార్చ్యూనర్, ఏది ఎక్కువ శక్తివంతమైనది?

  • Sabrimala Temple: శ‌బరిమల ఆలయంలో భక్తులపై దాడి!

Trending News

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd