ITR Refund 2025: ఆదాయపు పన్ను రిఫండ్ ఆలస్యం అవుతుందా?
సాధారణంగా రిటర్న్ ఫైల్ చేసిన ఒక వారంలోపు రిఫండ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. కొన్నిసార్లు దీనికి 2-3 రోజులు మాత్రమే పడుతుంది.
- By Gopichand Published Date - 07:39 PM, Thu - 18 September 25

ITR Refund 2025: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Refund 2025) ఫైల్ చేయడానికి గడువు సెప్టెంబర్ 16, 2025 వరకు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలు చేశారు. ఇప్పుడు వారు తమ రిఫండ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా రిటర్న్ ఫైల్ చేసిన ఒక వారంలోపు రిఫండ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. కొన్నిసార్లు దీనికి 2-3 రోజులు మాత్రమే పడుతుంది. అయితే మీ రిఫండ్ ఇంకా రాకపోతే ముందుగా మీ ఐటీఆర్ ఫారం ఆదాయపు పన్ను శాఖచే ఆమోదించబడిందా లేదా రిఫండ్ ప్రక్రియ ప్రారంభమైందా లేదా అని తనిఖీ చేయాలి. కొన్నిసార్లు చిన్నపాటి పొరపాట్ల వల్ల రిఫండ్ రావడంలో ఆలస్యం జరుగుతుంది.
ఈ-వెరిఫికేషన్ తర్వాత ప్రక్రియ ప్రారంభం
ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఈ-వెరిఫికేషన్ తర్వాత రిఫండ్ ప్రక్రియ మొదలవుతుంది. చాలా సందర్భాల్లో రిటర్న్ ఫైల్ చేసిన రెండు నుంచి నాలుగు వారాల్లో రిఫండ్ పన్ను చెల్లింపుదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు రిఫండ్ రాకపోతే రిటర్న్ దాఖలు చేసేటప్పుడు జరిగిన చిన్న పొరపాట్లను పరిశీలించడం, ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు స్పందించడం లేదా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిఫండ్ స్థితిని తనిఖీ చేయడం అవసరం. కొన్నిసార్లు రిఫండ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆలస్యం కావచ్చు.
Also Read: AP Assembly : GST సంస్కరణలకు మద్దతిచ్చిన తొలి రాష్ట్రం ఏపీ – పవన్
రిఫండ్ ఆలస్యానికి ఇతర కారణాలు
- బ్యాంక్ ఖాతా ప్రీ-వాలిడేటెడ్ కాకపోతే రిఫండ్ ఆలస్యం కావచ్చు. ఖాతాను ముందుగా ధృవీకరించడం (Pre-validate) తప్పనిసరి.
- బ్యాంక్ ఖాతాలో ఇచ్చిన పేరు పాన్ కార్డ్ వివరాలతో సరిపోలకపోతే.
- ఐఎఫ్‌ఎస్‌సి (IFSC) కోడ్ చెల్లనిదైతే.
- ఐటీఆర్‌లో ఇచ్చిన బ్యాంక్ ఖాతా మూసివేయబడితే.
- పాన్ కార్డు ఆధార్‌తో లింక్ కాకపోతే.
రిఫండ్ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?
- మొదట ఆదాయపు పన్ను వెబ్‌సైట్ www.incometax.gov.in కు వెళ్లి మీ పాన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మీ పాన్ ఆధార్‌తో లింక్ అయి ఉండటం ముఖ్యం. లేకపోతే వెబ్‌సైట్‌లో ‘లింక్ నౌ’ ఎంపికపై క్లిక్ చేసి లింక్ చేయాలి.
- ఇప్పుడు పై మెనూలో ‘సర్వీస్’పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘నో యువర్ రిఫండ్ స్టేటస్’ (Know your Refund Status) ఎంపికను ఎంచుకోండి.
- ‘ఈ-ఫైల్’ ట్యాబ్‌కు వెళ్లి ‘ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ‘వ్యూ ఫైల్డ్ రిటర్న్స్’ ఎంపికను ఎంచుకోండి.
- మీ రిఫండ్ స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.