AP Assembly : GST సంస్కరణలకు మద్దతిచ్చిన తొలి రాష్ట్రం ఏపీ – పవన్
AP Assembly : జీఎస్టీ సంస్కరణలు సమాజానికి, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. పన్ను తగ్గింపులు ప్రజల దైనందిన జీవితానికి ఉపశమనం కలిగిస్తాయని, వినియోగ వస్తువుల ధరలు తగ్గి సామాన్యులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
- Author : Sudheer
Date : 18-09-2025 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శాసనసభలో GST సంస్కరణల(GST Slab)పై జరిగిన చర్చలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణలు సమాజానికి, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. పన్ను తగ్గింపులు ప్రజల దైనందిన జీవితానికి ఉపశమనం కలిగిస్తాయని, వినియోగ వస్తువుల ధరలు తగ్గి సామాన్యులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
OG Trailer : OG ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
అలాగే రాష్ట్రానికి ఆదాయ నష్టం కలిగే అవకాశమున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాల కోసం తాము ఈ నిర్ణయానికి మద్దతు తెలిపామని పవన్ తెలిపారు. “జీఎస్టీ సంస్కరణల్లో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం గర్వకారణం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడినా, సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ సంస్కరణను ఆమోదించాం” అని ఆయన అన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
తాజాగా అమల్లోకి వచ్చిన ఈ చరిత్రాత్మక సంస్కరణకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పవన్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడంలో, రాష్ట్రాలు–కేంద్రం మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో GST కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. “ప్రజా ప్రయోజనం కోసం తీసుకునే ప్రతి నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది. GST సంస్కరణ కూడా అలాంటి మైలురాయిగా నిలవనుంది” అని పవన్ హితవు పలికారు.