PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్‌లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్‌కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
- By Gopichand Published Date - 07:40 PM, Sun - 24 August 25

PM Modi: భారతదేశం సాంకేతిక రంగంలో వేగంగా పురోగమిస్తోందని, ఈ ఏడాది చివరి నాటికి దేశంలో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్ మార్కెట్‌లోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ప్రకటించారు. దీంతోపాటు భారత్ 6G నెట్‌వర్క్‌పై కూడా వేగంగా పనిచేస్తోందని, త్వరలో 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్‌కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. “ఈ ఏడాది చివరి నాటికి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ మార్కెట్‌లోకి రానుంది. 50-60 ఏళ్ల క్రితమే సెమీకండక్టర్ తయారీని భారత్ ప్రారంభించగలిగేది. కానీ అది జరగలేదు. ఇప్పుడు మనం ఆ పరిస్థితిని మార్చేశాం. దేశంలో సెమీకండక్టర్ కర్మాగారాలు నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ కర్మాగారాల ఏర్పాటుతో సాంకేతిక రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించనుందని చెప్పారు.
Also Read: ODI Team Captain: అయ్యర్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్?!
#WATCH | Delhi: Addressing ET World Leaders Forum 2025, PM Narendra Modi says, "I want to tell you about another success of India. India is now going to export electric vehicles to 100 countries of the world. A very big program related to this is also being held after 2 days on… pic.twitter.com/zKjhsrYnyn
— ANI (@ANI) August 23, 2025
6G నెట్‌వర్క్, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి
సెమీకండక్టర్ల తయారీతో పాటు భారత్ 6G నెట్‌వర్క్ టెక్నాలజీపై కూడా వేగంగా దృష్టి సారించిందని మోదీ తెలిపారు. ప్రపంచ సాంకేతిక పురోగతిలో భారత్ ముందుండడానికి ఈ చర్యలు సహాయపడతాయని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో కూడా భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని ఆయన ప్రకటించారు. భారత్‌లో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను 100 దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమవుతున్నట్లు మోదీ చెప్పారు. “రెండు రోజుల్లో అంటే ఆగస్టు 26న దీనికి సంబంధించి ఒక పెద్ద కార్యక్రమం కూడా జరగనుంది” అని ఆయన ప్రకటించారు. ఈ అడుగు భారత దేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఒక ప్రధాన ఎగుమతిదారుగా నిలబెడుతుంది.
ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం
భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రిఫార్మ్, పర్ఫామ్, ట్రాన్స్‌ఫార్మ్’ (Reform, Perform, Transform) అనే నినాదంతో భారత్ ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి సహాయం చేస్తుందని ఆయన అన్నారు. “మేము నిశ్చలంగా ఉన్న నీటిలో రాళ్లు విసిరేవాళ్లం కాదు. వేగంగా ప్రవహించే నది దిశను మార్చగలిగేవాళ్లం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనలు భారతదేశాన్ని సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో స్వావలంబన దిశగా తీసుకెళ్లడానికి ముఖ్యమైన చర్యలుగా భావించవచ్చు.