HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Income Tax Rules 2026 New Tax Structure Implemented In The Country

కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులివే!

పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా బంధువులకు అద్దె చెల్లించి HRA క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు Form 124లో యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.

  • Author : Gopi Date : 20-03-2026 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Income Tax
Income Tax

Income Tax Rules 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ శుక్రవారం, మార్చి 20న ఈ-గెజిట్ ద్వారా ఆదాయపు పన్ను నియమాలు, 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను నియమాలు, 1962 స్థానంలో వస్తాయి. పన్ను నిబంధనల భాషను సరళీకరించడం, కోర్టు కేసులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.

కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో వచ్చే మార్పులు

నిబంధనలలో భారీ కోత.. 511 నుండి 333కి తగ్గింపు

పన్ను విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం నిబంధనల సంఖ్యను 511 నుండి కేవలం 333కి తగ్గించింది. అదేవిధంగా ఫారమ్‌ల సంఖ్యను కూడా 399 నుండి 190కి తగ్గించారు. దీనివల్ల టాక్స్ ఫైలింగ్ సంక్లిష్టత గణనీయంగా తగ్గుతుంది.

HRA కోసం 4 కొత్త మెట్రో నగరాలు

ఉద్యోగులకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం HRA (ఇంటి అద్దె భత్యం) మినహాయింపు. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై అనే 4 నగరాల్లో మాత్రమే 50% HRA మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ జాబితాలో మరో 4 నగరాలు చేరాయి. బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్. ఈ నగరాల్లో నివసించే ఉద్యోగులు కూడా ఇప్పుడు తమ బేసిక్ శాలరీలో 50% వరకు HRA క్లెయిమ్ చేసుకోవచ్చు.

Also Read: యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన ప‌వ‌ర్‌ పెట్రోల్ ధ‌ర‌లు!

  • పిల్లల చదువు, హాస్టల్ అలవెన్స్ 30 రెట్లు పెంపు
  • దశాబ్దాల నాటి అలవెన్సుల పరిమితిలో చారిత్రాత్మక మార్పులు చేశారు.
  • Education Allowance: నెలకు రూ. 100 నుండి నేరుగా రూ. 3,000కి (ఒక్కో బిడ్డకు) పెంచారు.
  • Hostel Allowance: నెలకు రూ. 300 నుండి నేరుగా రూ. 9,000కి (ఒక్కో బిడ్డకు) పెంచారు.

ఆఫీసులో భోజనం ఇకపై రూ. 200 వరకు ఫ్రీ

ఇప్పటివరకు ఆఫీసులో లభించే ఉచిత భోజనంపై పన్ను మినహాయింపు పరిమితి ఒక్కో పూటకు రూ. 50గా ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం దీనిని రూ. 200కి పెంచారు. అంటే ఇప్పుడు ఖరీదైన కూపన్లు లేదా క్యాంటీన్ ఫుడ్ విషయంలో పన్ను ఆందోళన తగ్గుతుంది.

యజమానితో సంబంధాన్ని వెల్లడించడం తప్పనిసరి

పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా బంధువులకు అద్దె చెల్లించి HRA క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు Form 124లో యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి రూ. 1 లక్ష కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తే యజమాని PAN వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

గిఫ్ట్- లోన్ పరిమితిలో మార్పులు

Gifts: కంపెనీ నుండి అందే బహుమతులు ఇప్పుడు రూ. 15,000 వరకు టాక్స్-ఫ్రీ (గతంలో ఇది రూ. 5,000).

Loans: కంపెనీ నుండి తీసుకునే రూ. 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలపై ఇకపై ఎటువంటి పన్ను ఉండదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • CBDT
  • House Rent Allowance
  • HRA
  • Income Tax Rules
  • Income Tax Rules 2026

Related News

Richest Indians

షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.

  • Gratuity

    కొత్త లేబర్ కోడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ అంటే ఏమిటి?

Latest News

  • US-Iran : అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన చర్చలు

  • Amazon : అమేజాన్ సమ్మర్ సేల్ – పిల్లల బొమ్మలు, ఆట వస్తువులపై 50% వరకు భారీ తగ్గింపు!

  • Maruti Suzuki : మారుతి సుజుకి సరికొత్త రికార్డు.. ఒకే రోజులో 108 ఇ-విటారా కార్ల డెలివరీ

  • Stock Market : మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలా? మీ పోర్ట్‌ఫోలియోలో ‘బంగారం’ ఎందుకు ఉండాలో తెలుసుకోండి!

  • Vaibhav Suryavanshi : జాతీయ జట్టులోకి వైభవ్ ఖరారు !!

Trending News

    • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd