HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Women Gold Prices Drop

Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 20-04-2026 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని తెరిచి, మళ్లీ మూసివేసింది ఇరాన్. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంత మేర తగ్గాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బంగారం అంటే భారతీయులకు చాలా ఇష్టం. పండగలు, శుభకార్యాలు, పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అలాంటి వాటిల్లో అక్షయ తృతీయ ఒకటి. ప్రస్తుతం దేశంలో అక్షయ తృతీయ కొనుగోళ్లతో జువెలరీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు దిగిరావడం గమనార్హం. ఇది మహిళలకు ఒక శుభవార్తగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం హార్ముజ్ జల సంధిని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ ప్రకటించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి బంగారం ధరలు పెరిగాయి. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై కాల్పులు జరిపిన ఇరాన్ ఇప్పుడు దానిని మళ్లీ మూసివేసింది. దీంతో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఆ ప్రభావం బంగారంపై పడింది. ఈ క్రమంలో పసిడి ధరలు తగ్గాయి. అయితే, గ్లోబల్ మార్కెట్లో పసిడి రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 20వ తేదీన బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 22 డాలర్లు పెరిగి 4793 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.78 శాతం మేర పెరిగి 79.89 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం బంగారంపై పడినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు తగ్గాయి. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ధరలు తగ్గడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 450 మేర తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు రూ. 1,42,350 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 490 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 1,55,290 వద్ద అమ్ముడవుతోంది.

స్థిరంగా వెండి ధరలు

బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ వెండి ధరలు మాత్రం గరిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి రేట్లలో ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా రూ. 2,80,000 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న క్రమంలో బంగారం, వెండి రేట్లలో మళ్లీ పెరుగుదల ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24K gold rate
  • Andhra Pradesh Gold Rate
  • Check Gold Rates
  • Global Gold Prices
  • gold price
  • Gold Prices Today

Related News

Gold Rate Today

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో పసిడి రేట్లు దిగివస్తున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రేటు రూ.600 పైన తగ్గింది. వెండి రేటు మాత్రం ఈరోజు మరో రూ.500 పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో మే 9వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు, వెండి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగార

  • Gold Price

    Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..

  • Today Gold Price

    Gold Price: ఒక్కసారిగా మారిన బంగారం వెండి ధరలు

  • Gold Price

    GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd