Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
- Author : Vamsi Chowdary Korata
Date : 03-06-2026 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళలకు ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో దేశీయంగా మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల పసిడి ధరల వివరాలు తెలుసుకుందాం.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బంగారంలోని పెట్టుబడులను డాలర్ ఈల్డ్స్ వైపు మళ్లిస్తున్నారు. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధర పెరుగుతుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. డాలర్ విలువ పెరుగుతుండడంతో పెట్టుబడులు అటువైపు మళ్లుతున్నాయి. దీంతో పసిడి ధరలు దిగివస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో జూన్ 3వ తేదీన 22, 24 క్యారెట్ల పసిడి రేటు, కిలో వెండి ధర ఎంత మేర ఉందో తెలుసుకుందాం.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధరలు దిగివచ్చాయి. గ్లోబల్ బులియన్ మార్కెట్లో ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు ప్రస్తుతం 4470 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.62 శాతం మేర దిగివచ్చింది. దీంతో స్పాట్ వెండి ధర ఔన్సుకు 75.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,56,220 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,200 వద్ద అమ్ముడవుతోంది.
బంగారంతో పాటు వెండి రేటు సైతం స్థిరంగానే కొనసాగుతోంది. సిల్వర్ ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత వారం నుంచి మారలేదు. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,90,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.