HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Prices Have Risen Again

Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2026 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజూ ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాలనే ప్రణాళికలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలు పెంచడం, ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే రూపాయి విలువ భారీగా పడిపోయి డాలర్ విలువ పెరగడం వల్ల దేశీయంగా పసిడి రేట్లు పెరుగుతున్నాయి. అయితే, గ్లోబల్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా దిగిరావడం గమనార్హం. ఈ క్రమంలో మే 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఈరోజు 22, 24 క్యారెట్లకు ఎంత మేర ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 40 డాలర్లు తగ్గి 4469 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.14 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి ధర ఈరోజు 73 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజూ పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములపై క్రితం రోజు రూ. 820 మేర పెరగగా, ఈరోజు మరో రూ.1310 మేర పెరిగింది. దీంతో ఈరోజు తులం బంగారం రేటు రూ.68,350 వద్దకు దూసుకెళ్లింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు మరో రూ.1200 మేర పెరిగింది. ఇప్పుడు తులం బంగారం రేటు రూ.62,150 వద్దకు చేరింది.

బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి మాత్రం ఊరట కల్పించింది. ఇటీవలే రూ.3 లక్షల మార్క్ దాటిన వెండి మళ్లీ వెనక్కి తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండి రేటు రూ.10 వేల మేర పడిపోయింది. దీంతో ఈరోజు కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 2,85,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24K gold price
  • Global Gold Prices
  • Gold Prices Today
  • Hyderabad Gold Prices

Related News

Gold Rate Today

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అందుతోంది. ఇటీవల కేంద్రం దిగుమతి సుంకాల్ని పెంచిన సమయంలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరగ్గా.. అక్కడి నుంచి చూస్తే భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. బంగారం ధర ఈ క్రమంలో 3 రోజుల్లో రూ. 10 వేలకు పైగా తగ్గగా.. సిల్వర్ రేటు రూ. 30 వేలు దిగిరావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారతీయులను బంగార

  • Today Gold Price

    Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Today Gold Silver Prices

    Today Gold Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Latest News

  • AP CM Chandrababu Naidu: కుప్పంలో గంగమ్మ తల్లికి సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

  • Vaibhav Suryavanshi: సూర్యవంశీ A సింబ‌ల్ సెల‌బ్రేష‌న్ వెనుక అస‌లు కథ ఇదే

  • Cm Vijay: లంచం అడిగితే..? సీఎం విజయ్ సంచలన నిర్ణయం

  • Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

  • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

Trending News

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd