December Bank Holidays : డిసెంబర్ నెలలో ఏకంగా 17రోజులు బ్యాంకులకు సెలవులు
2024 December Bank Holidays : మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవులు కాకుండా, డిసెంబర్‌లో మొత్తం 5 ఆదివారాలు, 2 శనివారాలు బ్యాంకులు మూసిఉంటాయి
- By Sudheer Published Date - 12:25 PM, Fri - 29 November 24

నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వచ్చాయో..వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి..అనేది చూస్తుంటారు.
రేపటితో నవంబర్ నెల పూర్తి అవుతుంది. ఆదివారం నుండి డిసెంబర్ నెల మొదలుకాబోతుంది. దీంతో బ్యాంకు ఖాతాదారులంతా డిసెంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయబోతున్నాయి..ఎన్ని రోజులు సెలవులు ఉండబోతున్నాయి..అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. డిసెంబర్‌లో చాలా సెలవులు ఉండబోతున్నాయి.మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవులు కాకుండా, డిసెంబర్‌లో మొత్తం 5 ఆదివారాలు, 2 శనివారాలు బ్యాంకులు మూసిఉంటాయి. భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం డిసెంబర్ బ్యాంకు సెలవులు (December Bank Holidays) ఏ ఏ రోజో చూద్దాం.
* డిసెంబర్ 1వ తేదీ: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
* డిసెంబర్ 3వ తేదీ: శుక్రవారం రోజున సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివ్ సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు ఇచ్చింది ఆర్‌బీఐ.
డిసెంబర్ 8వ తేదీ: ఆదివారం సందర్భంగా బ్యాంకులకు దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
* డిసెంబర్ 12వ తేదీ: మంగళవారం రోజున ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులకు సెలవు.
* డిసెంబర్ 16వ తేదీ: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
* డిసెంబర్ 17వ తేదీ: ఆదివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.
* డిసెంబర్ 18వ తేదీ: బుధవారం రోజున యూ సోసో థామ్ వర్థంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి.
* డిసెంబర్ 19వ తేదీ: గురువారం రోజున గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
* డిసెంబర్ 22వ తేదీ: ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
* డిసెంబర్ 24వ తేదీ: మంగళవారం రోజున క్రిస్మస్ సందర్బంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో బ్యాంకులకు ప్రత్యేక సెలవు ఉంటుంది.
* డిసెంబర్ 25వ తేదీ: బుధవారం రోజున క్రిస్మస్ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
* డిసెంబర్ 26వ తేదీ: గురువారం రోజున క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.
* డిసెంబర్ 27వ తేదీ: శుక్రవారం రోజున క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు
* డిసెంబర్ 28వ తేదీ: నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
* డిసెంబర్ 29వ తేదీ: ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసే ఉంటాయి.
* డిసెంబర్ 30వ తేదీ: సోమవారం రోజున యు కియాంగ్ నంగ్బా సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులకు సెలవు
* డిసెంబర్ 31వ తేదీ: మంగళవారం రోజున మిజోరాం, సిక్కింలలో నూతన సంవత్సర పండగ, లాసాంగ్, నామ్‌సూంగ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Read Also : International Jaguar Day : అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.?