Credit Cards: క్రెడిట్ కార్డుల గురించి ఆసక్తికర డేటా.. ఐదేళ్లలో డబుల్!
అయితే క్రెడిట్ కార్డుల వాడకం పెరగడంతో డెబిట్ కార్డ్ వినియోగం స్థిరంగా ఉంది. డిసెంబర్ 2019లో 80.53 కోట్ల డెబిట్ కార్డ్‌లు ఉండగా, డిసెంబర్ 2024 నాటికి 99.09 కోట్లకు పెరిగాయి.
- By Gopichand Published Date - 07:40 AM, Thu - 30 January 25

Credit Cards: క్రెడిట్ కార్డులు (Credit Cards) నేడు చాలా మంది జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారాయి. కరెంట్, వాటర్ బిల్లుల సెటిల్ నుంచి షాపింగ్ వరకు అన్నింటికీ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడానికి ఇదే కారణం. ఆర్‌బీఐ తాజా నివేదికలో క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన ఆసక్తికరమైన డేటా బయటకు వచ్చింది.
భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నివేదిక ప్రకారం, దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 2019 నుండి డిసెంబర్ 2024 వరకు రెట్టింపు అయింది. డిసెంబర్ 2019లో క్రెడిట్ కార్డుల సంఖ్య 5.53 కోట్లు కాగా.. ఇప్పుడు అది 10.80 కోట్లకు పెరిగింది.
డెబిట్ కార్డ్ వినియోగం తగ్గింది
అయితే క్రెడిట్ కార్డుల వాడకం పెరగడంతో డెబిట్ కార్డ్ వినియోగం స్థిరంగా ఉంది. డిసెంబర్ 2019లో 80.53 కోట్ల డెబిట్ కార్డ్‌లు ఉండగా, డిసెంబర్ 2024 నాటికి 99.09 కోట్లకు పెరిగాయి. అయితే క్రెడిట్ కార్డులతో పోలిస్తే డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతోంది. 2024లో క్రెడిట్ కార్డుల ద్వారా 447.23 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీని మొత్తం విలువ రూ. 20.37 లక్షల కోట్లు. అదే సమయంలో డెబిట్ కార్డుల ద్వారా 173.90 కోట్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.5.16 లక్షల కోట్లు.
Also Read: Virat Kohli Ranji Fees: రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజు ఎంత? లక్షల్లో నష్టం?
క్రెడిట్ కార్డుల వినియోగం ఏటా 15 శాతం పెరుగుతోందని, డెబిట్ కార్డుల వినియోగం తగ్గిందని నివేదిక పేర్కొంది. పట్టణ, సంపన్న తరగతి ప్రజలు ఇప్పుడు ఎక్కువగా కో-బ్రాండెడ్, డిజిటల్ సొల్యూషన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFB) కూడా క్రెడిట్ కార్డ్ విభాగంలోకి ప్రవేశించాయి. వారు డిసెంబర్ 2024 చివరి వరకు 10.97 లక్షల కార్డులను జారీ చేశారు. ఈ బ్యాంకులు ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాయి. ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్ 2019లో 122.6 లక్షల క్రెడిట్ కార్డ్‌లను జారీ చేశాయి. అది ఇప్పుడు 257.61 లక్షలకు పెరిగింది. అంటే 110 శాతం పెరిగింది. 2024 నాటికి ప్రైవేట్ బ్యాంకులు 766 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ మార్కెట్ వేగంగా పెరుగుతోందని, ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.