ITR Filing: ఐటీఆర్ దాఖలు చేసేవారికి బిగ్ అలర్ట్!
చాలా మంది పన్ను చెల్లింపుదారులు AISలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుగా వర్గీకరించిన ఆదాయం, లేదా తప్పు లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు.
- By Gopichand Published Date - 07:05 PM, Fri - 18 July 25

ITR Filing: 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing) దాఖలు చేసే సీజన్ జరుగుతోంది. ఈ సమయంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఎన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS)లో తప్పులు ఉన్నాయని సమాచారం అందించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను శాఖ దీనిపై స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది.
మొదటి భాగంలో ఉండే సమాచారం
AIS అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది ఆదాయపు పన్ను చట్టం 1961 కింద అవసరమైన అన్ని సమాచారాలను కలిగి ఉండే స్టేట్‌మెంట్. ఈ ఫారమ్‌లో పన్ను చెల్లింపుదారుకు సంబంధించిన సమాచారం రెండు భాగాలలో ఉంటుంది. మొదటి భాగంలో పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, చిరునామా వంటి సాధారణ సమాచారం ఉంటుంది. వ్యక్తి స్థానంలో కంపెనీ అయితే దాని పేరు, స్థాపన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైన సమాచారం ఉంటుంది.
"E- Filing Made Easy"
Are you claiming ineligible deductions?
Wrongful claim of deductions may invite penal provisions.Avoid errors, Avoid notices, File Smart. pic.twitter.com/n5tBpr2uel
— Income Tax India (@IncomeTaxIndia) July 8, 2025
Also Read: Rishabh Pant: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. నాల్గవ టెస్ట్‌కు పంత్ దూరం?!
రెండవ భాగంలో ఆర్థిక లావాదేవీల రికార్డు
ఫారమ్ రెండవ భాగం పన్ను చెల్లింపుదారు అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డును నిల్వ చేస్తుంది. ఉదాహరణకు బ్యాంక్ వడ్డీ, డివిడెండ్ ఆదాయం, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, విదేశీ ఆదాయం. ఒకవేళ AIS, మీరు దాఖలు చేసిన ITRలో ఏదైనా తేడా కనిపిస్తే మీకు నోటీసు రావచ్చు. జరిమానా విధించబడవచ్చు. లేదా రీఫండ్ ఆలస్యం కావచ్చు. అందుకే టాక్స్ నిపుణులు ITR దాఖలు చేయడానికి ముందు ఫారమ్ 26AS, AISతో క్రాస్ వెరిఫై చేయాలని సలహా ఇస్తున్నారు.
AISని ఈ విధంగా అప్‌డేట్ చేయండి
చాలా మంది పన్ను చెల్లింపుదారులు AISలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుగా వర్గీకరించిన ఆదాయం, లేదా తప్పు లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆదాయపు పన్ను శాఖ AISలో ఫీడ్‌బ్యాక్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది. మీకు AISలో ఏదైనా తప్పు లేదా అసంపూర్తి ఎంట్రీ కనిపిస్తే ఈ దశలను అనుసరించండి.
- ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ చేయండి.
- AIS సెక్షన్‌కు వెళ్లి తప్పు ఎంట్రీపై క్లిక్ చేయండి.
- ‘Optional’ లేదా ‘Add Feedback’ ఆప్షన్‌ను ఉపయోగించి సరైన కారణాన్ని ఎంచుకోండి.
- మీ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి.
- ఫీడ్‌బ్యాక్ చెల్లుబాటు అయినట్లు కనుగొనబడితే AIS అప్‌డేట్ చేయబడుతుంది. మీరు పోర్టల్ సహాయంతో మీ ఫీడ్‌బ్యాక్ స్థితిని తనిఖీ చేయవచ్చు. అది రిజెక్ట్ చేయబడిందా లేదా ఆమోదించబడిందా అని తెలుసుకోవచ్చు.