HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Bondada Engineering Limited Has Secured A Massive Order From Ap Transco

బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!

  • Author : Vamsi Chowdary Korata Date : 06-01-2026 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bondada Engineering Wins ₹627 Cr APTRANSCO BESS Order
Bondada Engineering Wins ₹627 Cr APTRANSCO BESS Order

Bondada Engineering Ltd ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో నుంచి భారీ ఆర్డల్ లభించింది. ఏకంగా రూ. 627 కోట్ల ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించిన క్రమంలో బోండాడా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు 4 శాతానికి పైగా లాభడింది. అయితే ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీ అయిన బోండాడా ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు ఈ స్టాక్ 4 శాతం మేర లాభపడింది. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్ కో) నుంచి భారీ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు బోండాడా ఇంజినీరింగ్ ప్రకటించిన క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఏపీలోని హిందూపురంలో 400/200 కేవీ సబ్‌స్టేషన్ వద్ద 225 మెగావాట్లయ 450 మెగావాట్ అవర్ సామర్థ్యం గల స్టాండలోన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉందని తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.627 కోట్లుగా ఉంది. ఈ వివరాలు బహిర్గతం చేసిన క్రమంలో స్టాక్ క్రితం రోజు భారీగా లాభాల్లోకి వెళ్లింది. ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లోకి జారుకుంది.

Bondada Engineering Wins ₹627 Cr APTRANSCO BESS Order  రూ.627 కోట్లు విలువైన స్టాండలోన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టను 18 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉందని బోండాడా ఇంజినీరింగ్ లిమిటెడ్ తెలిపింది. వీటితో కలిపి తమ బ్యాటరీ స్టోరేజ్ ఫోర్ట్ ఫోలియే 1 గిగా వాట్ అవర్‌కు చేరినట్లు వెల్లడించింది. ఈ ఆర్డర్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది ఎందుకంటే ఇది దీర్ఘకాలిక, యాన్యుటీ ఆధారిత ఆదాయ ప్రవాహాన్ని సృష్టిస్తుంది. నగదు ప్రవాహన్ని, ఆదాయాల అంచనాను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్టు దక్కించుకోవడంతో బొండాడా BESS పోర్ట్‌ఫోలియో దాదాపు 1 GWhకి చేరుకుంది. భారతదేశ గ్రిడ్-స్కేల్ ఇంధన నిల్వ స్థలంలో దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. దేశ పునరుత్పాదక ఏకీకరణ, ఇంధన పరివర్తన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4184.76 కోట్లుగా ఉంది. అలాగే ఈ కంపెనీ షేరు ధర రూ.360 స్థాయిలో ట్రేడవుతోంది.

కంపెనీ బలమైన ఆర్థిక పురోగతిని సాధించింది. ఆదాయం 2024 సెప్టెంబర్‌లో రూ.481 కోట్ల నుంచి 2025 సెప్టెంబర్‌లో రూ.1,217 కోట్లకు పెరిగింది. బలమైన ఆపరేటింగ్ లివరేజ్ కూడా లాభదాయకతను పెంచింది. నికర లాభం 151 శాతం పెరిగి రూ.37 కోట్ల నుంచి రూ.93 కోట్లకు చేరుకుంది. ఇది బలమైన అమలు, స్కేల్-ఆధారిత మార్జిన్ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ స్టాక్ 2.68 శాతం నష్టంతో రూ.360 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ 5 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో 17 శాతం నష్టపోయింది. గత ఏడాదిలో 40 శాతం నష్టపోయింది. గత 5 ఏళ్లలో మాత్రం 1000 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Transco
  • Battery Energy Storage System
  • BESS
  • Bondada Engineering Ltd
  • business
  • share market

Related News

Budget 2026

కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?

అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం.

  • E-passport

    భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

  • Aadhaar Updates

    ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

  • Bluefin Tuna

    రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

  • Mahindra is a sensation in the Indian automobile sector.

    భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా సంచలనం

Latest News

  • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

  • అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

  • టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!

  • కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

    • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd