Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!
ప్రతి రాష్ట్రంలో సెలవులు వేర్వేరు రోజుల్లో ఉండవచ్చు అనే విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు గమనించాలి. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే వినియోగదారులు తమ రాష్ట్రంలో ఉన్న సెలవుల జాబితాను తప్పకుండా చూసుకోవాలి.
- By Gopichand Published Date - 09:25 PM, Sun - 28 September 25

Bank Holidays: నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. దుర్గా పూజ, ఇతర పండుగల కారణంగా బ్యాంకులు సెలవులు (Bank Holidays) ప్రకటించాయి. అలాగే అక్టోబర్ నెలలో దసరా, దీపావళి, ఛట్ పూజ, భాయ్ దూజ్ వంటి ప్రధాన పండుగలు రానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినం ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని బ్యాంకులు సెలవులు ప్రకటించాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు వేర్వేరు రోజుల్లో ఉండవచ్చు అనే విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు గమనించాలి. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే వినియోగదారులు తమ రాష్ట్రంలో ఉన్న సెలవుల జాబితాను తప్పకుండా చూసుకోవాలి.
దుర్గా పూజ సెలవులు
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ అంతటా మహాసప్తమి నుండి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇవి వరుసగా 6 రోజుల పాటు కొనసాగుతాయి.
- సెప్టెంబర్ 27 (శనివారం)
- సెప్టెంబర్ 28 (ఆదివారం, వారాంతపు సెలవు)
- సెప్టెంబర్ 29 (సోమవారం)
- సెప్టెంబర్ 30 (మంగళవారం)
- అక్టోబర్ 1 (బుధవారం)
- అక్టోబర్ 2 (గురువారం, గాంధీ జయంతి)
Also Read: IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచిన వారికే ట్రోఫీనా?
కేరళలో సెప్టెంబర్ 30న బ్యాంకులు మూసివేత
నవరాత్రి సందర్భంగా సెప్టెంబర్ 30న బ్యాంకులకు సెలవు ఉంటుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల వారికి మూడు రోజుల సుదీర్ఘ సెలవు వస్తుంది. అక్టోబర్ 1, మహానవమి సందర్భంగా బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో సెలవు ఉంటుంది. అలాగే, అక్టోబర్ 2న జాతీయ సెలవు ఉంటుంది.
అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఉన్న రోజులు
- అక్టోబర్ 6: లక్ష్మీ పూజ సందర్భంగా పంజాబ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో సెలవు ఉంటుంది.
- అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో సెలవు ఉంటుంది.
- దీపావళి సెలవులు
- అక్టోబర్ 20: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, కర్ణాటక, కేరళ
- అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్, బీహార్
- అక్టోబర్ 22: హర్యానా, మహారాష్ట్ర
- అక్టోబర్ 23: గుజరాత్, ఉత్తరప్రదేశ్
- ఛట్ పూజ సందర్భంగా అక్టోబర్ 27-28 తేదీల్లో బీహార్‌లో 2 రోజుల సెలవు ప్రకటించారు.