HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Bank Holiday On New Year

జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

నేరుగా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు (నగదు జమ, చెక్కుల క్లియరెన్స్ వంటివి) సెలవు ఉన్న నగరాల్లో రేపు జరగవు. కాబట్టి మీ నగరంలో సెలవు ఉందో లేదో చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.

  • Author : Gopi Date : 31-12-2025 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bank Holiday
Bank Holiday

Bank Holiday: డిసెంబర్ 31వ తేదీతో 2025 సంవత్సరం ముగియనుంది. రేపటి నుండి కొత్త ఏడాది 2026 ప్రారంభం కాబోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా సెలవులు ఉంటాయనే ఉద్దేశంతో జనవరి 1న బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒకవేళ మీరు రేపు బ్యాంకు పనుల కోసం బయటకు వెళ్లాలనుకుంటే ఈ సమాచారాన్ని తప్పక చదవండి:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. జనవరి 1న దేశంలోని అన్ని నగరాల్లో బ్యాంకులు బంద్ ఉండవు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సెలవు ప్రకటించారు.

సెలవు ఉన్న నగరాలు ఇవే

ఆర్బీఐ నిబంధనల ప్రకారం రేపు (జనవరి 1) కింది నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.

  • ఐజ్వాల్
  • చెన్నై
  • గ్యాంగ్‌టక్
  • ఇంఫాల్
  • ఇటానగర్
  • కోహిమా
  • కోల్‌కతా
  • షిల్లాంగ్

ఈ నగరాలు మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, దేశ రాజధాని ఢిల్లీలో కూడా రేపు బ్యాంకులు తెరిచే ఉంటాయి. సాధారణ పని దినంలాగే లావాదేవీలు కొనసాగుతాయి.

Also Read: ఐపీఎల్ 2026.. ముస్తాఫిజుర్ రెహమాన్‌పై బీసీసీఐ నిషేధం విధించబోతుందా?

ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి

బ్యాంక్ బ్రాంచ్‌లకు సెలవు ఉన్న నగరాల్లో కూడా డిజిటల్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. కింది సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్: ఫండ్ ట్రాన్స్‌ఫర్ (IMPS, NEFT, RTGS), బిల్ పేమెంట్స్ వంటివి ఇంటి నుండే చేసుకోవచ్చు.

ATM సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి.

కార్డ్ సేవలు: డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి.

గమనిక: నేరుగా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు (నగదు జమ, చెక్కుల క్లియరెన్స్ వంటివి) సెలవు ఉన్న నగరాల్లో రేపు జరగవు. కాబట్టి మీ నగరంలో సెలవు ఉందో లేదో చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bank Holiday
  • Bank Holiday List
  • Bank Holiday On 1 January
  • business
  • business news
  • rbi

Related News

    Latest News

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd