Bank Account Nominees : మీ బ్యాంకు అకౌంటుకు ఇక నలుగురు నామినీలు
ఈమేరకు బ్యాంకు ఖాతాదారుడికి వెసులుబాటు కల్పించేలా ‘బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు- 2024’కు లోక్‌సభ(Bank Account Nominees) మంగళవారం ఆమోదం తెలిపింది.
- By Pasha Published Date - 09:57 AM, Wed - 4 December 24

Bank Account Nominees : బ్యాంకు అకౌంటుకు ఇంతకుముందు వరకు కేవలం ఒక నామినీయే ఉండేవారు. ఇకపై గరిష్ఠంగా నలుగురు వరకు నామినీలు ఉండొచ్చు. బ్యాంకు సేవింగ్స్ అకౌంటుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కోసం నలుగురు నామినీలను ఖాతాదారుడు అపాయింట్ చేసుకోవచ్చు. వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ వివరాలను సమర్పించవచ్చు. ఈమేరకు బ్యాంకు ఖాతాదారుడికి వెసులుబాటు కల్పించేలా ‘బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు- 2024’కు లోక్‌సభ(Bank Account Nominees) మంగళవారం ఆమోదం తెలిపింది.
బిల్లులోని ఇతర సవరణలు..
- సహకార బ్యాంకుల డైరెక్టర్ల (ఛైర్మన్, పూర్తి కాల డైరెక్టరు మినహా) పదవీ కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని నిర్ణయించారు.
- రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరు, సభ్యుడిగా ఉండేందుకు అనుమతి లభిస్తుంది.
- అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్లు, షేర్లు, బాండ్లపై వడ్డీ, ఉపసంహరణ నిధులను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read :Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
- నియంత్రణ నిబంధనల పాటింపుపై బ్యాంకులు నివేదిక సమర్పించే రోజులను రెండో శుక్రవారం, నాలుగో శుక్రవారం నుంచి ప్రతినెలా 15వ తేదీ, నెలలో చివరి రోజుకు మార్చారు.
- డైరెక్టర్‌షిప్స్‌కు సంబంధించి సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు.
Also Read : Giloy Juice: 21 రోజులు ఈ ఆకు రసం తాగితే షుగర్ తో సహా ఈ 3 వ్యాధులు అదుపులో ఉంటాయి!
- ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.85,520 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.
- వాణిజ్య బ్యాంకుల మొత్తం శాఖల సంఖ్య ఏడాది కాలంలో 3,792 పెరిగి ఈ ఏడాది సెప్టెంబరు చివరకు 16,55,001కు చేరాయి. ఇందులో 85,116 శాఖలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవి.