Zero Electric Bike: పేరుకే జీరో బైక్ అయినప్పటికీ మైలేజీలో హీరో అనిపించుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్?
జీరో మోటార్ సైకిల్ తన అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
- By Anshu Published Date - 04:30 PM, Wed - 14 August 24

ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంస్థ జీరో మోటార్ సైకిల్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హీరో మోటో కార్ప్‌తో చేతులు కలిపి కొత్త బైక్‌లను అభివృద్ధి చేసి భారత్‌లో లాంచ్ చేయనుంది. వాస్తవానికి దీని జీరో ఎఫ్ఎక్స్ఈ బెంగళూరులో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది స్ట్రీట్ బైక్, దీని పనితీరు, రైడింగ్ రేంజ్ బాగుంది. టెస్టింగ్ సమయంలో కేఏ-01 టెస్ట్ నంబర్ ప్లేట్ ఉంది.
కాగా హీరో మోటోకార్ప్ బెంగళూరులో పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెద్ద బృందాన్ని కలిగి ఉంది. హీరో తన ఏకైక విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ను బెంగళూరులో తయారు చేయడానికి చాలా ప్రణాళికలు చేస్తోంది. మరోవైపు జీరో ఎఫ్ఎక్స్ఈ గరిష్ట వేగం గంటకు 136. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు 170 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ టూ వరంగల్ వెళ్లి మళ్లీ తిరిగి కొంచెం దూరం రావొచ్చన్న మాట. ఇందులో 7.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని వల్ల ఈ మోటార్ సైకిల్ తో చాలా దూరం ప్రయాణించవచ్చు.
ఎఫ్ఎక్స్ఈ అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం పొజిషనింగ్ కు ప్రసిద్ధి చెందింది.
ఎఫ్ఎక్స్ఈ విలువ అమెరికాలో రూ.10 లక్షలకు పైగా ఉంది. అనగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది కూడా ఒకటి. హీరో మోటోకార్ప్ జీరో బైక్ చౌకైన వేరియంట్ లను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అందుకని బ్యాటరీ ప్యాక్ ను తగ్గించి ధరను తగ్గించుకోవచ్చు. అలాగే ఇందులో ఫీచర్ల సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చట. కాగా హీరో మోటోకార్ప్ జీరో బైక్‌ను భారతదేశంలో పూర్తిగా ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నప్పటికీ, పూర్తిగా లోడ్ చేసిన జీరో ఈవీని సరసమైన ధరలో చూసే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఆగస్టు 15 న విడుదల చేస్తుంది.