TVS Apache: టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్ ఫీచర్స్ మరియు ధర
టీవీఎస్ మెటార్ కంపెనీ సరికొత్త స్పెషల్ ఎడిషన్ బైక్ Apache RTR 160 4V 2023ను లాంచ్ చేసింది.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Thu - 8 December 22
ఆటోమొబైల్ కంపెనీలు ట్రెండ్‌కు తగినట్లు లేటెస్ట్ ఫీచర్లతో బైక్‌లను లాంచ్ చేస్తున్నాయి. లుక్‌తో పాటు, టెక్నాలజీ బేస్డ్ ఆప్షన్ల పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ (TVS) మెటార్ కంపెనీ సరికొత్త స్పెషల్ ఎడిషన్ బైక్ Apache RTR 160 4V 2023ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధరను రూ.1.30 లక్షలు (ఎక్స్ – షోరూమ్, న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ డీలర్షిప్ సెంటర్లలో ఈ బైక్ లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ గతేడాది చివర్లో వచ్చిన అపాచీ 160 4V బ్లాక్ కలర్ స్పెషల్ ఎడిషన్‌ను పోలి ఉంటుంది. సాధారణ అపాచీ RTR 160 4Vతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్‌లో కొన్ని మార్పులు చేశారు.
మరింత తేలికగా బైక్:
ఈ లేటెస్ట్ బైక్ మ్యాటీ బ్లాక్, పెరల్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. డ్యూయల్ టోన్ ఈట్, ఎడ్జస్టబుల్ క్లచ్, ఎడ్జస్టబుల్ బ్రేక్ లీవర్‌తో వస్తుంది. కాగా దీనిలో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేయడంతో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తుంది. అపాచీ RTR 160 4V 2023 స్పెషల్ ఎడిషన్‌లో ‘బుల్‌పప్’ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. దీని ఫలితంగా మొత్తం బరువు ఒక కిలోగ్రాము తగ్గి తేలికగా అనిపిస్తుంది. ఇతర స్పెషల్ ఎడిషన్ మాదిరిగానే ఫ్యూయల్ ట్యాంక్, పిలియన్ సీటు, వెనుక అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ అందించింది. బుల్‌పప్ ఎగ్జాస్ట్ యూనిట్ బుల్‌పప్ మెషిన్ గన్లను పోలి ఉండే అల్లాయ్ వీల్స్‌ను అమర్చింది.
Apache RTR 160 4V 2023 ఫీచర్లు:
Apache RTR 160 4V 2023 స్పెషల్ ఎడిషన్‌లో LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జస్టబుల్ క్లచ్, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్లతో స్టాండర్డ్ అండ్ ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ – ఛానల్ ABS సిస్టమ్, LED హెడ్ ల్యాంప్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా సిక్స్ – స్పోక్ బ్లాక్ ఫ్రంట్ అల్లాయ్ వీల్, LED డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరో వైపు LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో గేర్ పొజిషన్ ఇండికేటర్, రేడియల్ రియర్ టైర్, స్మార్ట్ Xonnect బ్లూటూత్ కంపాటిబులిటీ వంటివి కూడా ఉన్నాయి. అపాచీ RTR 200 4V సైతం అపాచీ RR 310లో తరహా ఆరెయిన్, అర్బన్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్లలో పనిచేస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే 2023 TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ 159.7 cc, సింగిల్ – సిలిండర్, ఎయిర్/ఆయిల్ – కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 17.63 hp గరిష్ట శక్తిని, 14.73 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని పవర్ ట్రెయిన్ 5 – స్పీడ్ ట్రాన్స్మిషన్ తో లింక్ అయి ఉంటుంది. అపాచీ 160 4V బజాజ్ పల్సర్ N160, హీరో ఎక్స్ట్రీమ్ 160R, హోండా హార్నెట్ 2.0 మొదలైన బైక్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
Also Read: Whale Flying in Sky: శంషాబాద్‌లో గాల్లో ఎగిరే తిమింగలం..!
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.