Whale Flying in Sky: శంషాబాద్‌లో గాల్లో ఎగిరే తిమింగలం..!
ఎయిర్‌బస్ (Airbus) కంపెనీ సరకు రవాణా కోసం ఇలాంటి అయిదు విమానాలనే తయారు చేసింది.
- By Maheswara Rao Nadella Published Date - 12:51 PM, Tue - 6 December 22
తిమింగలం (Whale) సముద్రంలో కదా ఉండేది గాల్లో ఎగరడం ఏమిటి? మీ సందేహం ఎంత నిజమో ఇదీ అంతే నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో (Cargo) విమానమిది. పేరు బెలుగా. దుబాయిలోని అల్ మక్తుమ్ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గంమధ్యలో ఇంధనం నింపుకొనేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. తిరిగి సోమవారం రాత్రి 7.20 గంటలకు బయల్దేరి వెళ్లింది.
తిమింగలం (Whale) ఆకారంలో ఉండే ఇది అనేక ప్రత్యేకతలు కల్గి ఉంది. ఎయిర్‌బస్ (Airbus) కంపెనీ సరకు రవాణా కోసం ఇలాంటి అయిదు విమానాలనే తయారు చేసింది. సాధారణంగా అన్ని విమానాల్లో వెనుక వైపు నుంచి లోడింగ్, ఆన్లోడింగ్ సదుపాయం ఉంటుంది. దీనికి మాత్రం ముందు నుంచి లోడింగ్ చేసే వీలుంది. లోడింగ్ సమయంలో ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా అంటోనొవ్ ఏఎన్-225 మ్రియాకు పేరుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఆ విమానాన్ని ఇటీవలే రష్యా ధ్వంసం చేసింది. దీంతో ఇదే అతిపెద్ద కార్గో (cargo) విమానంతో ఖ్యాతిలోకి వచ్చింది.
- తొలి విమానం తయారీ: 1994 సెప్టెంబరు 13
- సేవలు ప్రారంభం: 1996
- పొడవు: 184.3 అడుగులు
- ఎత్తు: 56.7 అడుగులు
- ఒక రెక్క వైశాల్యం: 2,800 చ.అడుగులు
- విమానం బరువు: 86.5 టన్నులు
- కార్గో సామర్థ్యం: 47 టన్నులు
Also Read: Nadikudi: అందరు వినండి.. నడికుడి లో రైళ్లు ఆగవు..
Related News
Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు.